ప్రధాన మంత్రి కార్యాలయం

మహారాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

Posted On: 01 MAY 2022 8:54AM by PIB Hyderabad

   హారాష్ట్ర వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలపడంతోపాటు వారి సౌభాగ్యం కోసం ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

   “మహారాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. దేశ ప్రగతి కోసం ఈ రాష్ట్రం ఎంతో అద్భుతంగా కృషి చేసింది. రాష్ట్ర ప్రజలు విభిన్న రంగాల్లో విశేషంగా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రజల సౌభాగ్యం కోసం నేను ప్రార్థిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.

 

 

***

DS/SH(Release ID: 1821848) Visitor Counter : 137