ప్రధాన మంత్రి కార్యాలయం

గ్లోబల్ పాటీదార్ బిజినెస్ సమిట్ ను ఏప్రిల్ 29 న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

Posted On: 28 APR 2022 6:13PM by PIB Hyderabad

సర్ దార్ ధామ్ నిర్వహణ లో జరుగనున్న గ్లోబల్ పాటీదార్ బిజినెస్ సమిట్ (జిపిబిఎస్) ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీ న మధ్యాహ్నం 12 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు.

పాటీదార్ సముదాయం యొక్క సామాజిక, ఆర్థిక అభివృద్ధి కి దన్ను గా నిలవడం కోసం సర్ దార్ ధామ్ మిశన్ 2026’ లో భాగం గా గ్లోబల్ పాటీదార్ బిజినెస్ సమిట్ (జిపిబిఎస్) ను ఏర్పాటు చేస్తున్నది. ఈ శిఖర సమ్మేళనాన్ని ప్రతి రెండు సంవత్సరాల కు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఒకటో శిఖర సమ్మేళనం 2018వ సంవత్సరం లో, రెండో శిఖర సమ్మేళనం 2020 వ సంవత్సరం లో గాంధీనగర్ లో జరిగాయి. వర్తమాన శిఖర సమ్మేళనం సూరత్ లో జరుగనుంది. ‘‘ఆత్మనిర్భర్ సముదాయం నుంచి ఆత్మనిర్భర్ గుజరాత్ మరియు భారతదేశం’’ అనేది జిపిబిఎస్ 2022 యొక్క ప్రధాన ఇతివృత్తం గా ఉంది. ఈ శిఖర సమ్మేళనం ఉద్దేశ్యం ఏమిటంటే అది పాటీదార్ సముదాయం లోని చిన్న, మధ్యతరహా మరియు పెద్ద వాణిజ్య సంస్థల ను ఒక చోటు కు తీసుకు రావడం, నవ పారిశ్రామికవేత్తల కు ప్రోత్సాహాన్ని మరియు సమర్ధన ను ఇవ్వడం, విద్యావంతులైన యువతుల కు యువకుల కు శిక్షణ ను ఇవ్వడం, ఉపాధి పరంగా వారికి సాయపడడం అనేవే. ఏప్రిల్ 29వ తేదీ మొదలుకొని మే 1వ తేదీ వరకు మూడు రోజుల పాటు సాగేటటువంటి ఈ శిఖర సమ్మేళనం లో ప్రభుత్వ పారిశ్రామిక విధానం, సూక్ష్మ లఘు, మధ్యతరహా వాణిజ్య సంస్థ ల (ఎమ్ఎస్ఎమ్ఇ స్) , స్టార్ట్-అప్స్, నూతన ఆవిష్కరణల సంబంధి విభిన్న అంశాల ను చేర్చడం జరిగింది.

 

***



(Release ID: 1821205) Visitor Counter : 118