ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

మెసర్స్ చీనాబ్ వ్యాలీ ప‌వ‌ర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 540 మెగావాట్ల క్వార్ హైడ్రో ఎల‌క్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం. ఈ ప్రాజెక్టు 1975 మిలియ‌న్ యూనిట్ల విద్యుత్ ను ఉత్ప‌త్తి చేయ‌గ‌ల‌ద‌ని అంచ‌నా.


క్వార్ ప్రాజెక్టు 54 నెల‌ల్లో పూర్తి కానుంది.

ఈ ప్రాజెక్టు నిర్మాణ కార్య‌క‌లాపాల వ‌ల్ల సుమారు 2500 మందికి ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయి. మొత్తంగా జ‌మ్ముకాశ్మీర్‌కేంద్ర‌పాలిత ప్రాంత సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఇది ఉప‌యోగ‌ప‌డ‌నుంది.

Posted On: 27 APR 2022 5:01PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశమైన కేంద్ర కేబినెట్ ఈరోజు 4526.12 కోట్ల రూపాయ‌ల  పెట్టుబ‌డితో జ‌మ్ము కాశ్మీర్లోని కిస్ట‌వ‌ర్ జిల్లా లోని చీనాబ్ న‌దిపై 540 మెగావాట్ల (ఎం.డ‌బ్ల్యు) క్వార్ హైడ్రో ఎల‌క్ట్రిక్ ప్రాజెక్టు కు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును మెస్స‌ర్స్ చీనాబ్ వ్యాలీ ప‌వ‌ర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ( మెస్స‌ర్స్ సివిపిపిఎల్‌) నిర్మిస్తుంది. ఇది ఎన్‌హెచ్‌పిసి, జెకెఎస్‌పిడిసి సంయుక్త కంపెనీ. 27.04.2022 నాటికి ఇందులో ఎన్ హెచ్‌పిసి వాటా 51 శాతం కాగా, జెకెఎస్‌పిడిసి వాటా  49 శాతంగా ఉంది.
ఈ ప్రాజెక్టు 1975.54 మిలియ‌న్ యూనిట్లను సంవ‌త్స‌రానికి 90 శాతం అంత‌కంటే ఎక్కువ విద్యుత్ ను న‌మ్మ‌కంగా  ఉత్ప‌త్తి చేస్తుంది.
భార‌త ప్ర‌భుత్వం మౌలిక స‌దుపాయాల ఖ‌ర్చుకోసం 69.80 కోట్లు గ్రాంటుగా స‌మ‌కూరుస్తుంది. అలాగే జెకెఎస్పిడిసి మెస‌ర్స్ సివిపిపిపిఎల్ లో ఈక్విటీ (49శాతం) కోసం జ‌మ్ము కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి655.08 కోట్ల రూపాయ‌ల‌ను కేంద్రం గ్రాంటుగా స‌మ‌కూరుస్తుంది. ఎన్‌.హెచ్‌.పి.సి 51 శాతం ఈక్విటీని అంటే రూ 681.82 కోట్ల రూపాయ‌ల‌ను త‌న అంత‌ర్గ‌త వ‌న‌రుల‌నుంచి స‌మ‌కూరుస్తుంది.. ఈ జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తి ప్రాజెకు 54 నెల‌ల వ్య‌వ‌ధిలో పూర్తిఅవుతుంది, ఈ ప్రాజెక్టు నుంచి ఉత్ప‌త్తి అనియ‌న విద్యుత్ గ్రిడ్ బాలెన్సింగ్ఃకు ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే విద్యుత్ స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ను మెరుగుపరుస్తుంది.
కేంద్ర‌పాలిత ప్ర‌భుత్వమైన జ‌మ్ముకాశ్మీర్ ప్ర‌భుత్వం ఈ ప్రాజెక్టును ఆచ‌ర‌ణ‌లోకి తెచ్చేందుకు, నీటి వినియోగ చార్జీల‌కు ప్రాజెక్టు ప్రారంభ‌మైన  నాటి నుంచి ప‌ది సంవ‌త్స‌రాల‌పాటు మినహాయింపును వ‌ర్తింప‌చేస్తారు.
 రాష్ట్ర వాటా జిఎస్‌టి తిరిగి చెల్లింపు(అంటే ఎస్‌జిఎస్‌టి), ఉచిత విద్యుత్‌ను ఏడాదికి రెండు శాతం వంతున డిక్రిమెంట‌ల్ విధానంలో మిన‌హాయిస్తుంది. అంటే కేంద్ర పాలిత ప్రాంత‌మైన జ‌మ్ముకాశ్మీర్‌కు  ప్రాజెక్టు ప్రారంభ‌మైన తొలి సంవ‌త్స‌రం ఉచిత విద్యుత్ 2 శాతంగా ఉంటుంది. ఆ త‌ర్వాత ఇది ఏడాదికి 2 శాతం వంతున పెరుగుతూ 6 వ సంవ‌త్స‌రం , ఆతర్వాత నాటికి ఇది 12 శాతానికి చేరుతుంది.
ఈ ప్రాజెక్టు నిర్మాణ కార్య‌క‌లాపాల ప్ర‌భావం ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా 2500 మందికి ఉపాధి క‌ల్పిస్తుంది. ఇది మొత్తంగా కేంద్ర పాలిత ప్రాంత‌మైన జ‌మ్ము కాశ్మీర్ సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంది. దీనికితోడు ఇది రూ 4,548.59 కోట్ల రూపాయ‌ల ఉచిత విద్యుత్‌, రూ 4,941.46 కోట్ల రూపాయ‌ల నీటి వినియోగ చార్జీల ద్వారా క్వార్ హైడ్రో విద్యుత్ ప్రాజెక్టు 40 సంవ‌త్స‌రాల కాలంలో జ‌మ్ము కాశ్మీర్ కు ప్ర‌యోజ‌నం ద‌క్కుతుంది.

 

***(Release ID: 1820837) Visitor Counter : 176