ప్రధాన మంత్రి కార్యాలయం
హిమాచల్ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి సందేశం
“హిమాచల్ ప్రదేశ్ ప్రజలు సవాలును అవకాశంగా మలుచుకున్నారు”.
“డబల్ ఇంజన్” ప్రభుత్వం గ్రామీణ రహదారుల విస్తరణ, హైవేలు, రైల్వే నెట్ వర్క్ విస్తరణ పనులు చేపట్టింది. వాటి ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి”
“నిజాయతీతో కూడిన నాయకత్వం, శాంతికాముకులైన ప్రజలు, దేవీ దేవతల ఆశీస్సులు, ప్రజల అవిశ్రాంత శ్రమ దేనితోనూ సరిపోల్చలేనివి. వేగవంతమైన అభివృద్ధికి అవసరమైన అన్నీ హిమాచల్ కు ఉన్నాయి”.
प्रविष्टि तिथि:
15 APR 2022 12:53PM by PIB Hyderabad
హిమాచల్ ప్రదేశ్ ఆవిర్భావ 75వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ 75వ ఆవిర్భావోత్సవం దేశ స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవ సంవత్సరంలోనే రావడం ఆనందదాయకమైన అంశమని అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ సమయంలో అభివృద్ధిని రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ అందేలా చేయాలన్న సంకల్పాన్ని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి కవితను కూడా ఉదహరిస్తూ శ్రద్ధాసక్తులు, అంకితభావం గల ప్రజలున్న ఈ అందమైన రాష్ట్రంతో ఆయనకు గల సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేశారు.
కొండప్రాంత రాష్ట్రంగా 1948లో హిమాచల్ ఆవిర్భావం నాటికి గల సవాళ్లను గుర్తు చేస్తూ సవాళ్లను అవకాశాలుగా మలుచుకున్న హిమాచల్ ప్రజలను ఆయన ప్రశంసించారు. ఉద్యానవనాలు, మిగులు విద్యుత్, అక్షరాస్యత రేటు, గ్రామీణ రోడ్ల అనుసంధానత, ప్రతీ ఇంటికీ కుళాయిల ద్వారా నీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్ల రంగాల్లో రాష్ట్రం సాధించిన విజయాలను ఆయన కొనియాడారు. గత 7-8 సపంవత్సరాలుగా వీటి నిర్మాణానికి జరిగిన కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. “జైరామ్ జీ యువ నాయకత్వంలో “ద్విగుణీకృత శక్తి గల (డబుల్ ఇంజన్)” ప్రభుత్వం గ్రామీణ రహదారుల విస్తరణ, హైవేల వెడల్పు, రైల్వే నెట్ వర్క్ విస్తరణకు ప్రత్యేక చొరవ ప్రదర్శించింది. దాని ఫలితాలు ఇప్పుడు కనిపస్తున్నాయి” అని ప్రధానమంత్రి అన్నారు.
పర్యాటక రంగంలో రాష్ట్రం అందుకున్న కొత్త శిఖరాలను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ దీని వల్ల స్థానిక ప్రజలకు కొత్త అవకాశాలు, ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. మహమ్మారి నుంచి రక్షణకు చేపట్టిన సత్వర, వేగవంతమైన వ్యాక్సినేషన్ గురించి ప్రస్తావిస్తూ ఆరోగ్య రక్షణ రంగంలో సాధించిన పురోగతిని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు.
హిమాచల్ ప్రదేశ్ పూర్తి సామర్థ్యం వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేయాల్సి ఉన్నదని ఆయన నొక్కి చెప్పారు. అమృత కాలంలో పర్యాటకం, ఉన్నత విద్య, పరిశోధన, ఐటి, బయోటెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రకృతి వ్యవసాయం విభాగాల్లో మరింత ముందుకు నడిపించాల్సి ఉందని ఆయన అన్నారు, ఈ ఏడాది బడ్జెట్ లో ప్రకటించిన వైబ్రెంట్ విలేజ్ పథకం హిమాచల్ ప్రదేశ్ కు అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుందని ఆయన చెప్పారు. కనెక్టివిటీ పెరుగుదల, అడవుల సుసంపన్నత, స్వచ్ఛత, ఈ కార్యక్రమాలన్నింటిలోనూ ప్రజా భాగస్వామ్యం వంటి పలు అంశాలు ఆయన ప్రస్తావించారు.
ముఖ్యమంత్రి, ఆయన బృందం కేంద్ర సంక్షేమ పథకాల విస్తరణకు ప్రత్యేకించి సామాజిక భద్రతా రంగ పటిష్ఠతకు చేస్తున్న కృషి గురించి మాట్లాడారు. “నిజాయతీతో కూడిన నాయకత్వం, ప్రజల శాంతికాముకత్వం, దేవతల ఆశీస్సులు, ప్రజల కఠోర శ్రమ సరిపోల్చలేనివి. వేగవంతమైన అభివృద్ధికి అవసరమైన అన్నీ హిమాచల్ కు ఉన్నాయి” అంటూ మోడీ ముగించారు.
(रिलीज़ आईडी: 1817521)
आगंतुक पटल : 201
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam