మంత్రిమండలి
సెక్యూరిటీస్ఎండ్ ఎక్ఛేంజ్ బోర్డ ఆఫ్ ఇండియా మరియు కెనడా కు చెందిన మేనిటోబా సెక్యూరిటీస్ కమిశన్ల మధ్య ద్వైపాక్షిక అవగాహన పూర్వక ఒప్పంద పత్రాని కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
13 APR 2022 3:28PM by PIB Hyderabad
సెక్యూరిటీస్ ఎండ్ ఎక్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కు మరియు కెనడా కు చెందిన మేనిటోబా సెక్యూరిటీస్ కమిశన్ ల మధ్య ద్వైపాక్షిక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పై సంతకాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ప్రయోజనాలు:
· ఈ ఎమ్ఒయు ఇతర అంశాల తో పాటు గా, సెక్యూరిటీల కు సంబంధించిన నియమాలు అనే రంగం లో పరస్పర సీమాంతర సహకారాని కి గాను ఒక లాంఛనమైనటువంటి ప్రాతిపదిక ను ప్రసాదిస్తుంది. దీని ద్వారా పరస్పర సహాయానికి మార్గం సుగమం అవుతుంది. పర్యవేక్షక విధుల లో దక్షత తో కూడిన పనితీరు కు ఆస్కారం ఏర్పడుతుంది. సాంకేతిక క్షేత్రీయ జ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకు రావడం లో సాయం లభిస్తుంది. అంతేకాక సెక్యూరిటీస్ మార్కెట్ లకు సంబంధించిన నియమావళి మరియు చట్టాల ను సమర్ధవంతం గా అమలు పరచడం లో సామర్థ్యం పెంపొందుతుంది.
· ఈ ఎమ్ఒయు మేనిటోబా కు చెందిన ఇన్వెస్టర్ లు ఎస్ఇబిఐ (‘సెబీ’) తో కలసి ఒక ఎఫ్ పిఐ రూపం లో నమోదు చేసుకోవడాని కి అర్హులు అయ్యేందుకు అవకాశాన్ని ఇస్తుంది.
ప్రభావం:
కెనడా లోని మేనిటోబా ప్రాంతం లో నెలకొన్న సంస్థ లు సెబీ తో కలసి ఫారెన్ పోర్ట్ పోలియో ఇన్ వెస్టర్ (ఎఫ్ పిఐ) గా నమోదు అవ్వాలి అనేటటువంటి అభిలాష ను కలిగివున్నాయి. అయితే, దీనికోసం పూర్వ నిర్ధారిత షరతులలో ఓ షరతు ఏమిటి అంటే అది.. ఒక విదేశాని కి లేదా విదేశీ ప్రాంతానికి సంబంధించిన సెక్యూరిటీస్ మార్కెట్ రెగ్యులేటర్ అనేది ఇంటర్ నేశనల్ ఆర్గనైజేశన్ ఆఫ్ సెక్యూరిటీస్ కమిశన్స్ మల్టీలేటరల్ మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఐఒఎస్ సిఒ ఎమ్ఎమ్ఒయు) లో సంతకందారు గా ఉండాలి.. అనేదే. దీనితో పాటు సెబీ తో ఎఫ్ పిఐ గా మేనిటోబా లోని సంస్థ లకు ఒక ద్వైపాక్షిక ఎమ్ఒయు పై సంతకాలు చేయడం కూడా అవసరమే. అప్పుడే అనుమతి దొరుకుతుంది. మేనిటోబా లో సుమారు ఇరవై ఎఫ్ పిఐలు ఉన్నాయి. వాటి ఖాతాదారుల కు చెందిన 2,665 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల ను అధీనం లో కలిగి ఉన్న ఈ ఎఫ్ పిఐ లు ఈ ద్వైపాక్షిక ఎమ్ఒయు పై సంతకాలు అయిపోవడం వల్ల ప్రయోజనాల ను అందుకొంటాయనే అంచనా ఉంది. ఆ సంస్థ లు భారతదేశం లోని మార్కెట్ లలో నిరంతరాయం గా పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగించడాని కి అర్హత ను సంపాదించుకోగలుగుతాయి.
***
(Release ID: 1816494)
Visitor Counter : 156
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam