మంత్రిమండలి

2022 జనవరి 1వ తేదీనుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కు అధిక ధరల భత్యం మరియు పింఛనుదారుల కు డియర్ నెస్  రిలీఫ్ ల తాలూకు అదనపు కిస్తీ ని ఇవ్వడానికిఆమోదం తెలిపిన మంత్రిమండలి 

Posted On: 30 MAR 2022 2:26PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కు అధికధరల భత్యం (డిఎ) మరియు పింఛన్ దారులకు డియర్ నెస్ రిలీఫ్ (డిఆర్) తాలూకు ఒక అదనపు కిస్తీ ని 2022 జనవరి 1వ తేదీ నుంచి వర్తించే విధం గా ఇవ్వడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. దీని లో మూల వేతనం/ పింఛను లో 31శాతం గా ఉన్న ప్రస్తుత రేటు లో 3 శాతం పెంపుదల ను అమలుపరచడమైంది. ధరల లో వృద్ధి కి పరిహారం గా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.

ఈ పెరుగుదల ఏడో కేంద్రీయ వేతన సంఘం సిఫారసు లఆధారం గా అంగీకరించిన సూత్రాని కి అనుగుణం గా ఉంది.

అధిక ధరల భత్యం మరియు డియర్ నెస్ రిలీఫ్ ల వల్ల ఖజానా పై ప్రతి సంవత్సరాని కి 9,544.50 కోట్ల రూపాయల వంతు న ప్రభావం పడుతుంది. దీని ద్వారా సుమారు 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వఉద్యోగుల కు మరియు 68.62 లక్షల మంది పింఛనుదారుల కు ప్రయోజనం దక్కనుంది.

 

***

 



(Release ID: 1811489) Visitor Counter : 376