ప్రధాన మంత్రి కార్యాలయం
‘పరీక్షా పే చర్చా’ పట్ల ప్రజల లో వ్యక్తం అవుతున్న ఉత్సాహాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
Posted On:
30 MAR 2022 10:05AM by PIB Hyderabad
ఈ సంవత్సరం లో జరుగబోయే ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం పట్ల లక్షల మంది లో వ్యక్తం అవుతున్నటువంటి ఉత్సాహాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి వారు వారి విలువైన సూచనల ను ఇచ్చినందుకు ఆయన అభినందన లు తెలిపారు. ‘పరీక్షా పే చర్చా’ కు తోడ్పాటు ను అందించిన విద్యార్థినీ విద్యార్థులు, తల్లితండ్రులు మరియు గురువుల కు ప్రధాన మంత్రి ధన్యవాదాలు కూడా పలికారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఈ సంవత్సరం జరుగబోయే ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం పట్ల ఎక్కడ లేని ఉత్సాహం వ్యక్తం అవుతోంది. లక్షల మంది వారి యొక్క విలువైన అభిప్రాయాల ను మరియు అనుభవాన్ని వెల్లడి చేశారు. నేను ఈ కార్యక్రమాని కి తోడ్పాటు ను అందించిన విద్యార్థినీ విద్యార్థుల కు, తల్లితండ్రుల కు మరియు గురువుల కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఏప్రిల్ 1వ తేదీ నాటి కార్యక్రమం కోసం నేను ఎదురు చూస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(Release ID: 1811336)
Visitor Counter : 137
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam