ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారతదేశం 400 బిలియన్ డాలర్ విలువ గల వస్తురూప ఎగుమతుల మహత్త్వాకాంక్షభరితలక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించినందుకు రైతుల కు, నేత శ్రమికుల కు,ఎమ్ఎస్ఎమ్ఇ లకు, తయారీదారు సంస్థల కు, ఎగుమతిదారు సంస్థల కు అభినందనలు తెలిపినప్రధాన మంత్రి

Posted On: 23 MAR 2022 9:58AM by PIB Hyderabad

భారతదేశం 400 బిలియన్ డాలర్ విలువ గల వస్తురూప ఎగుమతుల మహత్త్వాకాంక్షభరిత లక్ష్యాన్ని అనుకొన్న కాలం కంటే 9 రోజుల ముందుగానే సాధించడం తో రైతుల ను, నేత శ్రమికుల ను, ఎమ్ఎస్ఎమ్ఇ లను, తయారీదారు సంస్థల ను, ఎగుమతిదారు సంస్థల ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రశంసించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

 

‘‘భారతదేశం 400 బిలియన్ డాలర్ విలువైన వస్తు రూప ఎగుమతుల ను సాధించాలి అనేటటువంటి ఒక మహత్త్వాకాంక్షయుక్తమైన లక్ష్యాన్ని పెట్టుకొని, మరి ఆ లక్ష్యాన్ని మొట్టమొదటి సారిగా సాధించింది. ఈ సఫలత కు గాను మన రైతుల ను, నేత శ్రమికుల ను, ఎమ్ఎస్ఎమ్ఇ లను, తయారీదారు సంస్థల ను, ఎగుమతిదారు సంస్థల ను నేను అభినందిస్తున్నాను.

ఇది మన ఆత్మనిర్భర్ భారత్ ప్రయాణం లో ఒక కీలకమైనటువంటి మైలురాయి గా ఉంది. #LocalGoesGlobal’’ అని పేర్కొన్నారు.

 


(Release ID: 1808618) Visitor Counter : 206