ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరిలిస్తున్న భారత ప్రభుత్వం


ఉక్రెయిన్ నుంచి తిరిగి వస్తున్న భారతీయులకు వివిధ మినహాయింపులను అందిస్తూ అంతర్జాతీయ ప్రయాణ మార్గదర్శకత్వాలను సవరించి సడలింపులు అందిస్తున్న ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

ప్రయాణానికి ముందు తప్పనిసరిగా ఆర్‌టి-పిసిఆర్‌ పరీక్ష చేయించుకోవాలని, మరియు టీకా సర్టిఫికెట్ పొంది ఉండాలన్న నిబంధన నుంచి భారత జాతీయులకు మినహాయింపు;

ఎయిర్-సువిధ పోర్టల్‌లో బయలుదేరే ముందు పత్రాలను అప్‌లోడ్ చేయాలన్న నిబంధన కూడా సడలింపు



ఒక ప్రయాణికుడు ముందస్తు ఆర్‌టి-పిసిఆర్‌ పరీక్ష నివేదిక లేదా కోవిడ్-19 టీకా ను తీసుకోని పక్షంలో, 14 రోజుల పాటు స్వీయ పర్యవేక్షణ ఉండాలన్న సలహాతో వారు తమ నమూనాలను భారతదేశానికి వచ్చిన తర్వాత సమర్పించడానికి అనుమతి



28 ఫిబ్రవరి 2022 నాటికి, ఉక్రెయిన్ నుండి 1156 మంది భారతీయులు భారతదేశానికి చేరుకున్నారు, ప్రయాణీకులు ఎవరూ ఐసొలేషన్‌ కు పంపబడలేదు

Posted On: 28 FEB 2022 2:40PM by PIB Hyderabad

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా దేశానికి తీసుకువచ్చేందుకు  తరిలించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలకు కేంద్ర   ఆరోగ్య  కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని సహాయ సహకారాలను అందిస్తూ పూర్తి సమన్వయంతో పనిచేస్తోంది.  

మానవతా దృక్పధంతో అంతర్జాతీయ ప్రయాణికులు తప్పనిసరిగా పాటించవలసి ఉన్న మార్గదర్శకాలను   కేంద్ర ఆరోగ్య  కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సడలించింది. ఉక్రెయిన్‌ నుంచి తిరిగి వస్తన్న భారతీయులకు  ఈ క్రింది మినహాయింపులను అనుమతించింది:

 

 *ప్రస్తుతం అమలులో ఉన్న  'అంతర్జాతీయ రాకపోకలకు సంబంధించిన మార్గదర్శకాలు'లో నిర్దేశించబడిన తప్పనిసరి నిబంధనల ప్రకారం ప్రయాణానికి ముందు  ప్రీ-బోర్డింగ్ నెగటివ్ ఆర్‌టి-పిసిఆర్‌  పరీక్ష నివేదిక లేదా పూర్తిగా వ్యాక్సిన్ పొందిన సర్టిఫికేట్ లను ఎయిర్-సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయవలసి ఉంది. ఈ నిబంధన నుంచి ఉక్రెయిన్‌ నుంచి  భారతదేశానికి తిరిగి వస్తన్నవారికి కేంద్ర ఆరోగ్య  కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మినహాయింపు ఇచ్చింది.

 

 *ఇంకాకోవిడ్‌ -19 వ్యాక్సినేషన్‌ను పొందిన వ్యక్తులు (బయలుదేరిన దేశం/వ్యాక్సినేషన్‌తో సంబంధం లేకుండా) తమ ఆరోగ్య సంరక్షణ కోసం  తదుపరి 14 రోజుల పాటు స్వీయ-పర్యవేక్షణలో ఉండాలన్న  సలహాతో భారతదేశంలోని వారు చేరుతున్న విమానాశ్రయాల నుంచి  బయలుదేరడానికి అనుమతించబడతారు.

 

*ముందస్తు ఆర్‌టి-పిసిఆర్  ఆర్‌టి-పిసిఆర్‌  పరీక్షను సమర్పించని లేదా కోవిడ్-19 టీకా ను తీసుకోని ప్రయాణీకులను  14 రోజుల పాటు వారి ఆరోగ్యాన్ని స్వీయ పర్యవేక్షణ ఉండాలని సూచిస్తూ  వారు తమ నమూనాలను దేశానికి రాగానే సమర్పించేందుకు కేంద్ర ఆరోగ్య  కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అనుమతించి,ది. భారతదేశానికి వచ్చిన తర్వాత. పరీక్షలో పాజిటివ్ అని తేలితేవారు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వైద్యపరంగా పర్యవేక్షణలో ఉంటారు.

 

ఉక్రెయిన్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంతో ఆ దేశంలో  పెద్ద సంఖ్యలో భారతీయ జాతీయులు (ప్రధానంగా విద్యార్థులు) చిక్కుకున్నారు. ఉక్రెయిన్‌ జారీ చేసిన  ఎయిర్‌మెన్‌ నోటీసు లేదా ఎయిర్ మిషన్‌లకు నోటీసు  దృష్ట్యా  చిక్కుకుపోయిన భారతీయులను విమానాల ద్వారా నేరుగా తరలించడం సాధ్యం కాదు. దీనివల్ల పోలాండ్రొమేనియాస్లోవేకియా మరియు హంగేరీ లోని భారతీయ మిషన్లు ఉక్రెయిన్ నుంచి భారతీయ పౌరులను తీసుకురావడానికి మరియు ఆపరేషన్ గంగా ఫ్లైట్ కింద సంబంధిత దేశాల నుంచి భారతదేశానికి చేరవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

 

 28 ఫిబ్రవరి 2022 నాటికి (మధ్యాహ్నం 12:00 గంటల వరకు) ఉక్రెయిన్ నుంచి అయిదు విమానాలు (ముంబయిలో ఒకటి మరియు ఢిల్లీలో నాలుగు) దేశానికి చేరుకున్నాయి. వీటిలో  మొత్తం 1156 మంది మంది భారతదేశానికి చేరుకున్నారు తిరిగి వచ్చిన ప్రయాణికులలో ఏఒక్కరిని ఐసొలేషన్‌ కు పంపలేదు.

***


(Release ID: 1801831) Visitor Counter : 163