హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రూ. 1,364.88 కోట్ల ఆర్థిక వ్య‌యంతో ఇమ్మిగ్రేష‌న్ వీసా ఫారిన‌ర్స్ రిజిస్ట్రేష‌న్ ట్రాకింగ్ ( విదేశీయుల వ‌ల‌స వీసా న‌మోదు ప‌ద్ధ‌తి - ఐవిఎఫ్ఆర్‌టి) ప‌థ‌కాన్ని మార్చి, 31, 2021 కాల‌ప‌రిమితిని ఐదేళ్ళ‌పాటు - ఏప్రిల్ 1, 2021 నుంచి మార్చి 31, 2026 వ‌ర‌కు పొడిగించేందుకు ఆమోద ముద్ర వేసిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని ప్ర‌భుత్వం


వ‌ల‌స‌లు, వీసా సేవ‌ల‌ను తాజాప‌రుస్తూ, ఆధునిక‌రించ‌డ‌మ‌న్న ఐవిఎఫ్ఆర్‌టి కీల‌క ల‌క్ష్యం ప‌ట్ల మోడీ ప్ర‌భుత్వ నిబ‌ద్ధ‌త‌ను ప‌ట్టి చూపుతున్న ఈ ప‌థ‌కం కొన‌సాగింపు

కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గ‌ద‌ర్శ‌నంలో ఈ ప‌థ‌కం ద్వారా జాతీయ భ‌ద్ర‌త‌ను బ‌లోపేతం చేయ‌డంతో పాటుగా చ‌ట్ట‌బ‌ద్ధంగా వ‌చ్చిన ప్ర‌యాణీకులకు స‌మీకృత సేవ‌లందించే సుర‌క్షిత చ‌ట్రాన్నిఅందించే ల‌క్ష్యంతో ప‌ని చేయ‌నున్న‌హోం వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ

Posted On: 25 FEB 2022 1:01PM by PIB Hyderabad

 రూ. 1,364.88 కోట్ల ఆర్థిక వ్య‌యంతో ఇమ్మిగ్రేష‌న్ వీసా ఫారిన‌ర్స్ రిజిస్ట్రేష‌న్ ట్రాకింగ్ ( విదేశీయుల వ‌ల‌స వీసా న‌మోదు ప‌ద్ధ‌తి - ఐవిఎఫ్ఆర్‌టి) ప‌థ‌కాన్ని మార్చి, 31, 2021 కాల‌ప‌రిమితిని ఐదేళ్ళ‌పాటు - ఏప్రిల్ 1, 2021 నుంచి మార్చి 31, 2026 వ‌ర‌కు పొడిగించేందుకు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని ప్ర‌భుత్వ ఆమోద ముద్ర వేసింది. 
వ‌ల‌స‌లు, వీసా సేవ‌ల‌ను తాజాప‌రుస్తూ, ఆధునిక‌రించ‌డ‌మ‌న్న ఐవిఎఫ్ఆర్‌టి కీల‌క ల‌క్ష్యం ప‌ట్ల మోడీ ప్ర‌భుత్వ నిబ‌ద్ధ‌త‌ను ఈ ప‌థ‌కం కొన‌సాగింపు ప‌ట్టి చూపుతుంది. కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గ‌ద‌ర్శ‌నంలో  ఈ ప‌థ‌కం ద్వారా జాతీయ భ‌ద్ర‌త‌ను బ‌లోపేతం చేయ‌డంతో పాటుగా చ‌ట్ట‌బ‌ద్ధంగా వ‌చ్చిన ప్ర‌యాణీకులకు స‌మీకృత సేవ‌లందించే సుర‌క్షిత చ‌ట్రాన్నిఅందించే ల‌క్ష్యంతో హోం వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ ప‌ని చేయ‌నుంది.
ఈ ప్రాజెక్టు అంత‌ర్జాతీయంగా వ్యాపించి ఉండ‌ట‌మే కాక‌, ఇమ్మిగ్రేష‌న్‌, వీసా జారీ, విదేశీయుల న‌మోదు, భార‌త్‌లో వారి క‌ద‌లిక‌ల‌ను అనుస‌రించేందుకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న 192 అంత‌ర్జాతీయ మిష‌న్ల‌ను, భార‌త్‌లోని108 ఇమ్మిగ్రేష‌న్ చెక్‌పోస్టులు (ఐసిపిలు), 12 విదేశీయుల ప్రాంతీయ న‌మోదు అధికారులు (ఎఫ్ఆర్ఆర్ ఒ), కార్యాల‌యాలు, 700కు పైగా విదేశీయుల న‌మోదు అధికారులు (ఎఫ్ఆర్ఒ)లు, దేశ‌వ్యాప్తంగా ఉన్న‌ పోలీసు సూప‌రింటెండ్లు (ఎస్‌పిలు) /  డిప్యూటీ క‌మిష‌న‌ర్స్ ఆఫ్ పోలీస్ (డిసిపిలు)ల‌ను జోడించి, విధుల‌ను అనుకూల‌ప‌రిచే ల‌క్ష్యంతో ప‌ని చేస్తోంది. 
ఐవిఎఫ్ఆర్‌టి ప్రారంభ‌మైన త‌ర్వాత‌, జారీ చేసిన వీసా, ఒసిఐ కార్డుల సంఖ్య 2014లో 44.43 ల‌క్ష‌ల నుంచి 2019లో 64.59 ల‌క్ష‌లుగా , 7. 7 శాతం వార్షిక కాంపౌండ్ వృద్ధి రేటు (సిఎజిఆర్‌)తో పెరిగింది. వీసా జారీకి ప‌ట్టే ప్ర‌క్రియ స‌మయాన్ని 15 నుంచి 30 రోజుల (ఐవిఎఫ్ఇఆర్‌టి కాలానికి ముందు) స‌మ‌యాన్ని ఈ-వీసాల‌కు గ‌రిష్టంగా 72 గంట‌ల‌కు త‌గ్గించారు. దీనితో 24 గంట‌ల‌లో 95 శాతం ఈ-వీసాలు జారీ అవుతున్నాయి. దీనితో భార‌త్ నుంచి ఇత‌ర దేశాల‌కు, అటు నుంచి భార‌త్‌కు అంత‌ర్జాతీయ ర‌ద్దీ 3.71 కోట్ల నుంచి గ‌త 10 ఏళ్ళ‌ల్లో 7.5 కోట్ల‌కు, 7.2 శాతం సిఎజిఆర్ తో పెరిగింది. 

***
 


(Release ID: 1801276) Visitor Counter : 157