ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రపంచ రేడియో దినం నాడు రేడియోశ్రోతల కు మరియు ఈ ముఖ్యమైన మాధ్యమాన్ని సంపన్నం చేస్తున్న వారికి అభినందనల నుతెలియజేసిన ప్రధాన మంత్రి

Posted On: 13 FEB 2022 3:05PM by PIB Hyderabad

రేడియో ప్రసారాల ను వింటూ ఉండే వారు అందరి కి మరియు ముఖ్యమైనటువంటి ఈ మాధ్యమాన్ని తమ ప్రతిభ తో సంపన్నం చేస్తున్న వారికి ప్రపంచ రేడియో దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ ల లో

‘‘రేడియో ప్రసారాల ను వింటూ ఉండే వారు అందరి కి మరియు ముఖ్యమైనటువంటి ఈ మాధ్యమాన్ని తమ ప్రతిభ తో, రచనాత్మకత తో సంపన్నం చేస్తున్న వారి కి ప్రపంచ రేడియో దినం సందర్భం లో ఇవే అభినందన లు. ఇంట్లో కావచ్చు, ప్రయాణాల లో కావచ్చు, ఇంకా ఇతరేతర స్థలాల లో కావచ్చు.. ప్రజల జీవితాల లో రేడియో మమేకం అయిపోయింది. ప్రజల తో ముడిపడటానికి అది ఒక అద్భుతమైనటువంటి మాధ్యమం గా ఉంది.’’

సకారాత్మకత ను ప్రసరింపచేయటానికి అలాగే ఇతరుల జీవితాల లో ఒక గుణాత్మకమైనటువంటి మార్పు ను తీసుకు రావడం లో ముందు భాగాన నిలబడుతున్న వారి ని గుర్తించటానికి రేడియో ఏ విధం గా ఒక గొప్ప మాధ్యమం కాగలుగుతుందో అనే విషయాన్ని #మన్ కీ బాత్ (మనసు లో మాట) కార్యక్రమం కారణం గా నేను పదే పదే గమనిస్తూ వస్తున్నాను. ఈ కార్యక్రమాని కి తోడ్పాటు ను అందిస్తున్న వారందరి కి కూడా నేను ధన్యవాదాల ను వ్యక్తం చేయదలచుకొన్నాను.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH



(Release ID: 1798108) Visitor Counter : 117