ప్రధాన మంత్రి కార్యాలయం
కెన్యా పూర్వ ప్రధాని శ్రీ రైలాఅమోలో ఒడింగా కు మరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి మధ్య జరిగిన సమావేశం
Posted On:
13 FEB 2022 2:41PM by PIB Hyderabad
ప్రస్తుతం భారతదేశానికి ప్రైవేటు సందర్శన కు విచ్చేసినటువంటి కెన్యా పూర్వ ప్రధాని శ్రీ రైలా అమోలో ఒడింగా తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న భేటీ అయ్యారు. ఈ నేత లు ఇద్దరూ దశాబ్దాలు గా స్నేహపూర్వక వ్యక్తిగత సంబంధాల ను నెరపుతున్నారు.
దాదాపు గా మూడున్నర సంవత్సరాల తరువాత శ్రీ ఒడింగా ను కలుసుకోగలిగినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 2008వ సంవత్సరం నాటి నుంచి శ్రీ ఒడింగా తో అటు కెన్యా లో మరి ఇటు భారతదేశం లో జరిగిన మాటామంతీ లను, అలాగే 2009వ సంవత్సరం లోను మరియు 2012వ సంవత్సరం లోను వైబ్రన్ట్ గుజరాత్ సమిట్ కు శ్రీ ఒడింగా అందించిన సమర్థన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చుకొన్నారు.
పరస్పర హితం ముడిపడ్డ ఇతర అంశాల పై ఇద్దరు నేత లు చర్చ లు జరిపారు. భారతదేశం- కెన్యా సంబంధాల ను మరింత గా బలపరచడం కోసం ప్రధాన మంత్రి తన నిబద్ధత ను వెలిబుచ్చారు.
శ్రీ ఒడింగా మంచి ఆరోగ్యం తో ఉండాలని, ఆయన భావి ప్రయాస లు ఫలించాలంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
***
(Release ID: 1798107)
Visitor Counter : 134
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam