ప్రధాన మంత్రి కార్యాలయం
మాజీ ఎం.పి. శ్రీ సి. జంగారెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
05 FEB 2022 12:07PM by PIB Hyderabad
మాజీ ఎం.పి. శ్రీ సి. జంగారెడ్డి మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఇందుకు సంబంధించి ఆయన ఒక ట్వీట్ చేస్తూ,
"సి.జంగారెడ్డి గారు తమ జీవితాన్ని ప్రజాజీవితానికి అంకితం చేశారు. జనసంఘ్, బిజెపిలను నూతన శిఖరాలకుచేర్చే కృషిలో వారు అంతర్భాగంగా ఉంటూవచ్చారు.ఎంతో మంది ప్రజల హృదయాలు, ఆలోచనలలో వారు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. వారు ఎందరో కార్యకర్తలకు ప్రేరణనిచ్చారు. వారి మృతి బాధ కలిగించింది.
పార్టీ అత్యంత క్లిష్టదశలో ఉన్నప్పుడు వారు బిజెపికి బలమైన గొంతుకగా ఉన్నారు. వారి కుమారుడితో మాట్లాడి వారి కుటుంబానికి సంతాపం తెలిపాను. ఓం శాంతి ." అని ప్రధానమంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1795773)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam