ఆర్థిక మంత్రిత్వ శాఖ
'అమృత్ కాల్' సమయంలో మహిళల నేతృత్వంలోని నారి శక్తి అభివృద్ధికి దూతగా నిలుస్తుంది
- రెండు లక్షల అంగన్‌వాడీలను కొత్త తరం ‘సాక్షం అంగన్‌వాడీలు’గా ఆధునికీకరణ
Posted On:
01 FEB 2022 1:06PM by PIB Hyderabad
భారతదేశం@100లకు 25 సంవత్సరాల చేరువలో ఉన్న ఈ అమృతకాల సమయంలో.. నారీ శక్తి మన దేశ ఉజ్వల భవిష్యత్తుకు మరియు మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి దూతగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్‌లో సమర్పించిన కేంద్ర బడ్జెట్‌లో గుర్తించినట్టయింది. గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో భారతదేశం@100కు సంబంధించిన విజన్‌ను నిర్దేశించారు. నారీ శక్తి ప్రాముఖ్యతను గుర్తించి, ప్రభుత్వం మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క పథకాలను సమగ్రంగా పునరుద్ధరించింది. దీని ప్రకారం మహిళలు, పిల్లలకు సమగ్ర ప్రయోజనాలను అందించడానికి మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, సాక్షం అంగన్‌వాడీ మరియు పోషణ్ 2.0 అనే మూడు పథకాలు ఇటీవల ప్రారంభించబడ్డాయి. సాక్షం అంగన్‌వాడీలు మెరుగైన మౌలిక సదుపాయాలు మరియు ఆడియో-విజువల్ ఎయిడ్‌లను కలిగి ఉన్న కొత్త తరం అంగన్‌వాడీలు, ఇవి స్వచ్ఛమైన శక్తితో నడిచేవి. ఇవి పిల్లల అభివృద్ధికి సంబంధించి ప్రారంభంలో మెరుగైన వాతావరణాన్ని అందిస్తాయి. ఈ పథకం కింద రెండు లక్షల అంగన్‌వాడీలను ఆధునికీకరస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు.
****
(Release ID: 1794564)
Visitor Counter : 343
Read this release in:
Manipuri
,
Odia
,
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam