మంత్రిమండలి
పారిశుధ్యకార్మికుల కోసం ఏర్పాటు చేసిన జాతీయ సంఘం పదవీ కాలాన్ని మూడు సంవత్సరాల పాటుపొడిగించేందుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
19 JAN 2022 3:38PM by PIB Hyderabad
నేశనల్ కమిశన్ ఫార్ సఫాయీ కర్మచారిస్ (ఎన్ సిఎస్ కె) యొక్క పదవీ కాలాన్ని 2022వ సంవత్సరం మార్చి నెల 31వ తేదీ అనంతరం మూడు సంవత్సరాల పాటు పొడిగించడాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయం ఫలితం గా సుమారు 43.68 కోట్ల రూపాయల మేరకు ఆర్థిక ప్రభావం ఉండబోతోంది.
ప్రభావం:
ఎన్ సిఎస్ కె ను 2022 మార్చి నెల 31 తరువాత సైతం మరో మూడు సంవత్సరాల పాటు కొనసాగించనుండటం తో దేశం లో సఫాయీ కర్మచారులు మరియు గుర్తింపు పొందిన పారిశుధ్య కార్మికుల కు ప్రధానం గా లబ్ధి చేకూరనుంది. ఎమ్ఎస్ యాక్ట్ సర్వేక్షణ ప్రకారం 2021వ సంవత్సరం డిసెంబరు 31వ తేదీ నాటికి గుర్తింపు పొందిన పారిశుధ్య కార్మికుల సంఖ్య 58,098 గా ఉంది.
వివరాలు:
ఎన్ సిఎస్ కె ను మొదట్లో 1997వ సంవత్సరం మార్చి నెల 31వ తేదీ వరకు పని చేసేటట్లుగా ఎన్ సిఎస్ కె చట్టం, 1993 లోని నియమ నిబంధనల కు అనుగుణం గా 1993వ సంవత్సరం లో ఏర్పాటు చేయడమైంది. అటు తరువాత ఈ చట్టం యొక్క చెల్లుబాటును తొలుత 2002వ సంవత్సరం మార్చి నెల 31వ తేదీ వరకు పొడిగించడమైంది. తదనంతరం దీనిని 2004వ సంవత్సరం ఫిబ్రవరి 29వ తేదీ వరకు పొడిగించారు. ఎన్ సిఎస్ కె చట్టం 2004 ఫిబ్రవరి 29 నాటి నుంచి రద్దు అయింది. ఆ తరువాత ఎన్ సిఎస్ కె పదవీ కాలాన్ని ఎప్పటికప్పుడు తీర్మానాల ద్వారా ఒక శాసనేతర సంస్థ గా పొడిగిస్తూ రావడం జరిగింది. ప్రస్తుత కమిశన్ పదవీ కాలం 2022వ సంవత్సరం మార్చి నెల 31 వరకు ఉంది.
పూర్వరంగం:
పారిశుధ్య కార్మికుల సంక్షేమాని కి, విద్య కు మరియు వారికి ప్రస్తుతం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల మదింపునకు, అలాగే వారి యొక్క నిర్ధిష్ట ఫిర్యాదులు తదితర కేసుల దర్యాప్తునకై ప్రభుత్వాని కి తన సిఫార్సుల ను ఇస్తూ వస్తోంది. అంతేకాకుండా, ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్ మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దేర్ రిహాబిలిటేశన్ యాక్ట్, 2013 నిబంధనావళి ని అనుసరించి ఎన్ సిఎస్ కె కు చట్టం అమలు, పర్యవేక్షణ పని ని అప్పగించడమైంది. దీనితో పాటు, చట్టం నిబంధనల అతిక్రమణ కు సంబంధించిన ఫిర్యాదుల పై దర్యాప్తు జరపడం మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాన్ని ప్రభావశీలమైన రీతి లో అమలు పరచడం కోసం తగిన సూచనల ను, సలహాల ను ఇవ్వడం అనేవి కూడా ఎన్ సిఎస్ కె విధుల లో భాగం గా ఉన్నాయి. పారిశుధ్య కార్మికుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక చర్యల ను చేపట్టినప్పటికీ కూడాను సామాజికం గా, ఆర్థికం గా, విద్య పరం గా వారు ఇప్పటికీ ఎన్నో కష్టనష్టాల కు లోనవుతున్నారు. పారిశుధ్య రంగం లో మనిషి ప్రమేయాన్ని దాదాపు గా దూరం చేసినప్పటికీ, ఆ కోవ కు చెందిన ఘటనలు అక్కడక్కడా తలెత్తుతూనే ఉన్నాయి. మురుగునీటి నిలవ ట్యాంకులు, సెప్టిక్ ట్యాంకుల ను శుభ్రపరచేటటువంటి అపాయకరమైన పనులు ఇప్పటికీ ప్రభుత్వం అగ్రప్రాధాన్య రంగం గానే ఉంది. ఈ కారణం గా ప్రభుత్వం సఫాయీ కర్మచారు ల సంక్షేమం కోసం ఉద్దేశించిన వివిధ కార్యక్రమాల పర్యవేక్షణ ను పట్టించుకోవడం ఎంతైనా అవసరం అని భావిస్తోంది. దేశం లో మురుగునీటి పారుదల మరియు సెప్టిక్ ట్యాంకుల ను శుభ్రపరిచే పని ని పూర్తి గా యాంత్రికీకరించాలి. అంతేకాకుండా, ఈ విధుల నిర్వహణ లో ఉంటూ వచ్చిన వారికి పునరావాసాన్ని ఏర్పాటు చేయాలి అనే లక్ష్యాన్ని ప్రభుత్వం సాధించాలని కంకణం కట్టుకొంది.
****
(Release ID: 1791011)
Visitor Counter : 266
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam