ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

జనవరి 20న ‘ఆజాదీ కే అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కే ఓర్’ జాతీయ స్థాయి ప్రారంభ కార్యక్రమం లోప్రధానోపన్యాసాన్ని ఇవ్వనున్న ప్రధాన మంత్రి

Posted On: 19 JAN 2022 12:59PM by PIB Hyderabad

ఆజాదీ కే అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కే ఓర్జాతీయ స్థాయి ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం జనవరి 20వ తేదీ నాడు ఉదయం 10 గంటల 30 నిమిషాల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధానోపన్యాసం చేయనున్నారు. ఈ కార్యక్రమం బ్రహ్మ కుమారీ స్ ద్వారా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్కు సమర్పణం గా ఏడాది పొడవునా నిర్వహించే కార్యక్రమాల ను ఆవిష్కరించబోతున్నది. దీని లో 30 కి పైగా ప్రచార ఉద్యమాలు, అంతేకాకుండా 15,000 కు పైగా వివిధ కార్యక్రమాలు భాగం గా ఉంటాయి.

 

ఈ కార్యక్రమం లో, బ్రహ్మ కుమారీస్ కు చెందిన ఏడు కార్యక్రమాల కు ప్రధాన మంత్రి జెండా ను చూపనున్నారు. ఆ ఏడు కార్యక్రమాలు ఏమేమిటి అంటే అవి ‘మై ఇండియా హెల్థీ ఇండియా’, ఆత్మనిర్భర్ భారత్: సెల్ఫ్ రిలయంట్ ఫార్మర్స్ (ఆత్మనిర్భర్ భారత్: స్వయంసమృద్ధియుక్త రైతులు); విమెన్: ఫ్లాగ్ బేరర్స్ ఆఫ్ ఇండియా (మహిళ లు: భారతదేశ పతాకదారులు); పవర్ ఆఫ్ పీస్ బస్ క్యాంపెయిన్ (శాంతి తాలూకు శక్తి ని చాటిచెప్పే బస్సు ప్రధాన ప్రచార ఉద్యమం); ‘అన్ దేఖా భారత్ సైకిల్ ర్యాలీ’ (ఇదివరకు చూసి ఉండనటువంటి భారతదేశం పేరుతో ఏర్పాటు చేసే సైకిల్ ర్యాలీ); యునైటెడ్ ఇండియా మోటార్ బైక్ క్యాంపెయిన్ (ఐక్య భారతదేశం పేరిట మోటార్ సైకిల్ ప్రచార ఉద్యమం) మరియు స్వచ్ఛ్ భారత్ అభియాన్ లో భాగం గా చేపట్టే హరిత కార్యక్రమాలు అన్నమాట.

 

‘ది మై ఇండియా హెల్థీ ఇండియా’ కార్యక్రమం లో ఆధ్యాత్మికత, అభ్యున్నతి, ఇంకా పోషణ సంబంధి విజ్ఞానం అనే అంశాల పై ప్రత్యేక శ్రద్ధ ను తీసుకొంటూ, ఆసుపత్రుల లో, వైద్య కళాశాలల్లో అనేక కార్యక్రమాల ను నిర్వహించడం జరుగుతుంది. వీటిలో వైద్య చికిత్స శిబిరాలు, కేన్సర్ పరీక్షలు, వైద్యులకు మరియు ఇతర ఆరోగ్య సంరక్షణ శ్రమికుల కు ఉద్దేశించిన సమావేశాలు తదితర కార్యక్రమాలు భాగం గా ఉంటాయి. ‘ఆత్మనిర్భర్ భారత్: సెల్ఫ్ రిలయంట్ ఫార్మర్స్’ లో భాగం గా 75 రైతు సశక్తీకరణ ప్రచార ఉద్యమాలు, 75 రైతుల సమావేశాలు, 75 సస్ టేనబల్ యోగిక్ ఫార్మింగ్ ట్రేనింగ్ ప్రోగ్రాముల తో పాటు రైతుల సంక్షేమాని కి ఉద్దేశించినటువంటి అనేక ఇతర కార్యక్రమాల ను కూడా నిర్వహించడం జరుగుతుంది. ‘విమెన్: ఫ్లాగ్ బేరర్స్ ఆఫ్ ఇండియా’ లో భాగం గా చేపట్టేటువంటి కార్యక్రమాల లో మహిళ ల సశక్తీకరణ ద్వారా మరియు ఆడ శిశువు యొక్క సశక్తీకరణ ద్వారా సామాజిక పరివర్తన అనే అంశాల పై శ్రద్ధ ను తీసుకోవడం జరుగుతుంది.

 

‘ది పవర్ ఆఫ్ పీస్ బస్ క్యాంపెయిన్’ 75 నగరాలను, తహసీల్స్ ను చుట్టివస్తుంది. నేటి యువత లో ఒక సకారాత్మకమైనటువంటి మార్పుఅనే అంశం పై ఒక ప్రదర్శన దీని లో భాగం గా ఉంటుంది. ‘ది అన్ దేఖా భారత్ సైకిల్ ర్యాలీ’ ని వేరు వేరు వారసత్వ ప్రదేశాల లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం వారసత్వాని కి మరియు పర్యావరణాని కి మధ్య ఒక సంబంధాన్ని చాటిచెప్పేది గా ఉంటుంది. ‘ది యునైటెడ్ ఇండియా మోటార్ బైక్ క్యాంపెయిన్’ ను మౌంట్ అబు నుంచి దిల్లీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రచార ఉద్యమం అనేక నగరాల గుండా సాగుతుంది. స్వచ్ఛ్ భారత్ అభియాన్ లో భాగం గా చేపట్టే కార్యక్రమాల లో నెలవారీ శుభ్రత ఉద్యమాలు, సాముదాయిక శుభ్రత కార్యక్రమాలు మరియు అవగాహన ను పెంపొందించే కార్యక్రమాలు భాగం గా ఉంటాయి.

 

ఈ కార్యక్రమం లో, గ్రామీ పురస్కార విజేత శ్రీ రికీ కేజ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్కు అంకితం చేసిన ఒక గీతాన్ని కూడాను విడుదల చేయడం జరుగుతుంది.

 

బ్రహ్మ కుమారీస్ వ్యక్తి లో పరివర్తన కు మరియు ప్రపంచం యొక్క పునరుద్ధరణ కు అంకితం అయినటువంటి ఒక ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక ఉద్యమం. బ్రహ్మ కుమారీస్ ను 1937వ సంవత్సరం లో భారతదేశం లో స్థాపించడం జరిగింది. ఇది 130 కి పైగా దేశాల కు విస్తరించింది. బ్రహ్మ కుమారీస్ స్థాపక పిత అయిన పితాశ్రీ ప్రజాపిత బ్రహ్మ యొక్క 53 వ ఆరోహణ వార్షికోత్సవం సందర్భం లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది.

 



(Release ID: 1790942) Visitor Counter : 186