ప్రధాన మంత్రి కార్యాలయం

ప‌రీక్షా పే చ‌ర్చ 2022లో పాల్గొన వ‌ల‌సిందిగా ప్ర‌ధాన‌మంత్రి పిలుపు

Posted On: 15 JAN 2022 7:53PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప‌రీక్షా పే చ‌ర్చ 2022 కార్య‌క్ర‌మానికి సంబంధించి ట్వీట్ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి త‌మ పేర్ల‌ను రిజిస్ట‌ర్ చేసుకోవ‌ల‌సిందిగా ఆయ‌న కోరారు. ఇది మ‌న క్రియాశీల యువ‌త‌తో మాట్లాడ‌డానికి,వారి స‌వాళ్లు, వారి ఆకాంక్ష‌ల‌ను మ‌రింత గా అవ‌గాహ‌న చేసుకోవ‌డానికి వీలు క‌లిగిస్తుందని ఆయ‌న అన్నారు.
ఇందుకు సంబంధించి ప్ర‌ధాన‌మంత్రి ఒక ట్వీట్ చేస్తూ.,
"ప‌రీక్ష‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నాయి. అందుకే ప‌రీక్షా పే చ‌ర్చ 2022. మ‌నం ఒత్తిడి లేని ప‌రీక్ష‌ల గురించి మాట్లాడుకుందాం. మ‌రోసారి మ‌నం మ‌న ప‌రీక్షా యోధుల‌కు, వారి త‌ల్లిదండ్రుల‌కు, టీచ‌ర్ల‌కు మ‌ద్ద‌తునిద్దాం. ఈ ఏడాది #PPC2022. కు రిజిస్ట‌ర్ చేసుకోవ‌ల‌సిందిగా మిమ్మ‌లంద‌రినీ కోరుతున్నాను.
వ్య‌క్తిగ‌తంగా ప‌రీక్షా పే చ‌ర్చ అనేది ఒక అద్భుత‌మైన అభ్య‌స‌న అనుభ‌వం. ఇది మ‌న క్రియాశీల యువ‌త‌తో అనుసంధానం కావ‌డాన‌కి, వారి స‌వాళ్లు, ఆకాంక్ష‌ల గురించి మ‌రింత మెరుగ్గా అవ‌గాహ‌న చేసుకోవ‌డానికి ఉప‌క‌రిస్తుంది. విద్యా ప్ర‌పంచంలో వ‌స్తున్న అధునాత‌న ధోర‌ణుల‌ను తెలుసుకోవ‌డానికి  కూడా ఇది అవ‌కాశం క‌ల్పిస్తుంది. #PPC2022" అని ప్ర‌ధాన మంత్రి త‌మ సందేశంలో పేర్కొన్నారు.


 

 

***

DS/SH



(Release ID: 1790270) Visitor Counter : 117