ప్రధాన మంత్రి కార్యాలయం
సైనిక దినోత్సవం నేపథ్యంలో భారత సైనిక సిబ్బందికి ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
15 JAN 2022 9:13AM by PIB Hyderabad
సైనిక దినోత్సవం సందర్భంగా భారత సైనిక సిబ్బందికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు వరుస ట్వీట్లద్వారా ఇచ్చిన సందేశాల్లో-
“సైనిక దినోత్సవం నేపథ్యంలో ముఖ్యంగా ధైర్యానికి మారుపేరైన మన సైనికులకు, గౌరవనీయులైన మాజీ సిబ్బందికి, వారి కుటుంబాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. ధైర్యసాహసాలు, వృత్తి నైపుణ్యానికి భారత సైన్యం పెట్టింది పేరు. జాతీయ భద్రతకు భారత సైన్యం అందిస్తున్న అమూల్య సహకారం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు.
భారత సైనిక సిబ్బంది అత్యంత దుర్గమ భూభాగాల్లో సేవలందిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సహా మానవతా సంక్షోభ సమయాల్లో తోటి పౌరులకు సహాయం చేయడంలో వారికి మరెవరూ సాటిరారు. విదేశాల్లోనూ శాంతి పరిరక్షక విధుల్లో మన సైన్యం అద్భుత సహకారం అందించడం భారతదేశానికి గర్వకారణం” అని ఆయన పేర్కొన్నారు.
Best wishes on the occasion of Army Day, especially to our courageous soldiers, respected veterans and their families. The Indian Army is known for its bravery and professionalism. Words cannot do justice to the invaluable contribution of the Indian Army towards national safety. pic.twitter.com/UwvmbVD1hq
— Narendra Modi (@narendramodi) January 15, 2022
***
DS/SH
(Release ID: 1790101)
Visitor Counter : 267
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam