ప్రధాన మంత్రి కార్యాలయం
కోవిడ్ టీకాలు వేసే కార్యక్రమంలో 150 కోట్ల మైలురాయిని దాటినందుకు తోటి పౌరులకు అభినందనలు తెలియజేసిన - ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
07 JAN 2022 9:41PM by PIB Hyderabad
కోవిడ్ టీకాలు వేసే కార్యక్రమంలో 150 కోట్ల మైలురాయిని దాటినందుకు తోటి పౌరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. టీకాలు వేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్న వారందరికీ భారతదేశం కృతజ్ఞతలు తెలుపుతోందని కూడా ఆయన పేర్కొన్నారు.
ఈ విషయమై, ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా వరుస ట్వీట్లు చేస్తూ, ఈ విధంగా పేర్కొన్నారు:
"టీకా విషయంలో ఒక అద్భుతమైన రోజు! 150 కోట్ల మైలురాయిని దాటినందుకు మన తోటి పౌరులకు అభినందనలు. మన టీకాలు వేసే కార్యక్రమం ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. ఇదే సమయంలో, మనం కోవిడ్-19 కు సంబంధించిన నియమ, నిబంధనలను అన్నింటినీ పాటించడం కొనసాగిస్తూనే ఉందాము.
టీకాలు వేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్న వారందరికీ భారతదేశం కృతజ్ఞతలు తెలియజేస్తోంది. ప్రజలకు టీకాలు వేస్తున్న మన వైద్యులు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు మన ధన్యవాదాలు. అర్హులైన వారందరూ తమ టీకాలను సకాలంలో పొందవలసిందిగా నేను కోరుతున్నాను. అందరం కలిసి, కోవిడ్-19 తో పోరాడుదాం."
(रिलीज़ आईडी: 1788484)
आगंतुक पटल : 188
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam