ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19ః అపోహ‌లు వ‌ర్సెస్ వాస్త‌వాలు


డ‌బ్ల్యుహెచ్ఒ ఇయుఎల్‌లో కోవాక్సిన్ వాక్సిన్ మార్గ‌ద‌ర్శ‌కాలు ప్ర‌స్తావించన‌ప్ప‌టికీ, 15-18 మ‌ధ్య వ‌య‌సుగ‌ల‌వారికి వాక్సిన్ ఇస్తున్నారంటూ వ‌స్తున్న మీడియా వార్త‌లు త‌ప్పు దోవ‌ప‌ట్టించేవి

Posted On: 07 JAN 2022 10:43AM by PIB Hyderabad

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యు హెచ్ ఒ) కోవాక్సిన్ వాక్సిన్‌ను 15-18 వ‌య‌సు మ‌ధ్య ఉన్న‌వారికి  ఇవ్వ‌డానికి అత్య‌వ‌స‌ర వినియోగ జాబితా (ఎమ‌ర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (ఇయుఎల్‌) గుర్తింపు లేక‌పోయిన‌ప్ప‌టికీ 15-18 మ‌ధ్య వ‌య‌సు గ‌ల‌వారికి కోవాక్సిన్ ను ఇవ్వ‌డానికి ఆమోదించిన‌ట్టు కొన్ని మీడియా నివేదిక‌లు పేర్కొంటున్నాయి. అటువంటి నివేదిక‌లు స‌త్య‌దూర‌మైన‌వి, ప‌క్క‌దోవ ప‌ట్టించేవే కాక త‌ప్పుడు స‌మాచారం ఇస్తున్నాయి. 
కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. ఈ మార్గ‌ద‌ర్శ‌కాలు డ‌బ్ల్యు హెచ్ ఒ ఇచ్ఇచ‌న ఇయుఎల్‌ను ఎక్క‌డా ప్ర‌స్తావించ‌వు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ 27 డిసెంబ‌ర్ 2021న 15-18 ఏళ్ళ వ‌య‌సు మ‌ధ్య ఉన్న నూత‌న ల‌బ్ధిదారులు అన్న శీర్షిక‌తో మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. ఇందులోని ఉప‌-శీర్షిక (ఇ) పేజీ 4, అటువంటి ల‌బ్ధిదారుల‌కు వాక్సినేష‌న్ కోసం ఉన్న ఎంపిక కోవాక్సిన్‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మై ఉంటుంది, ఎందుకంటే, 15-18 వ‌య‌సు మ‌ధ్య గ‌ల వారికి ఇచ్చేందుకు ఇయుఎల్ పొందుప‌రిచిన వాక్సిన్ ఇది మాత్ర‌మే అని పేర్కొంటోంది. 
జాతీయ రెగ్యులేట‌ర్ అయిన సిడిఎస్‌సిఒ,12-18 వ‌య‌సు గ‌ల‌వారికి కోవాక్సిన్ వాక్సిన్ ఇచ్చేందుకు ఇయుఎల్‌ను 24 డిసెంబ‌ర్ 2021న ఇవ్వ‌డం జ‌రిగింది. అనంత‌రం, 15-18 వ‌య‌సులో ఉన్న యుక్త వ‌య‌స్కుల‌కు వాక్సినేష‌న్ ఇచ్చేందుకు, గుర్తించిన ఇత‌ర వ‌ర్గాల‌కు ముందు జాగ్ర‌త్త‌గ్గా ఇచ్చే  డోసుకు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 27 డిసెంబ‌ర్ 2021న జారీ చేసింది. ఇవ‌న్నీ ఆరోగ్య‌మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి, వాటిని దిగువ‌న ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయ‌డం ద్వారా చూడ‌వ‌చ్చు-
https://www.mohfw.gov.in/pdf/GuidelinesforCOVID19VaccinationofChildrenbetween15to18yearsandPrecautionDosetoHCWsFLWs&60populationwithcomorbidities.pdf

***



(Release ID: 1788304) Visitor Counter : 175