ప్రధాన మంత్రి కార్యాలయం
వారాణసీలో అనేక ప్రాజెక్టుల ను ప్రారంభించిన\ శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
గ్రామీణఆర్థిక వ్యవస్థ ను బలపరచే మరియు ఆ ప్రాంత రైతుల కు సాయపడే ప్రయాస లో భాగం గా, ‘బనాస్డెయరీ సంకుల్’ కు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
ఉత్తర్ప్రదేశ్ కు చెందిన 20 లక్షలమంది కి పైగా నివాసుల కు గ్రామీణ ఆవాస హక్కుల పత్రం ‘ఘరౌనీ’ని ప్రధాన మంత్రి పంపిణీ చేశారు
870 కోట్ల రూపాయల కు పైగా విలువైన 22 అభివృద్ధి ప్రధానమైన ప్రాజెక్టుల నుకూడా ప్రధాన మంత్రి వారాణసీ లో ప్రారంభించారు; అలాగే కొన్ని ప్రాజెక్టుల కు ఆయన శంకుస్థాపన చేశారు
కిసాన్ దివస్ నాడు చౌధరీ చరణ్ సింహ్ గారి కి ప్రధాన మంత్రి శ్రద్ధాంజలిని ఘటించారు
‘‘భారతదేశం యొక్క పాడి రంగాన్ని బలపరచడం మా ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యాల లో ఒకటి గా ఉంది’’
‘‘గోవులు, గేదెల విషయమై గేలి చేసే వాళ్లు దేశం లోని 8 కోట్లకుటుంబాల కు బతుకు తెరువు ను అటువంటి పశు సంపదే సమకూర్చుతున్నదనే సంగతి నిమరచిపోతున్నారు’’
‘‘ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ దేశం లో పాల ను అత్యధికం గాఉత్పత్తిచేస్తున్న రాష్ట్రం గా మాత్రమే కాకుండా, పాడి రంగం విస్తరణ లో సైతం గణనీయమైన స్థాయి లో ముందంజ వేస్తున్నది’’
‘‘పాడి రంగం, పశుపోషణ మరియు శ్వేత క్రాంతి కి నూతనోత్తేజం.. వీటికి రైతు ల జీవనం లో మార్పు ను తీసుకు రావడం లో ఒకప్రధానమైన పాత్ర ఉంది’’
‘‘ధరణి మాత కు కొత్త బలాన్ని ఇవ్వడం కోసం, మననేల ను కాపాడడం కోసం, రాబోయే తరాల భవిష్యత్తు ను భద్రం గా ఉంచడం కోసం మనం మరో సారిప్రాకృతిక వ్యవసాయం వైపున కు మళ్ళి తీరాలి. ఇదినేటి కాలం లో తక్షణావసరం గా ఉంది’’
‘‘వారాణసీ ఒక అభివృద్ధి నమూనా గా శర వేగంగా అవతరిస్తున్నది. కొత్త ప్రాజెక్టు లు వారాణసీ ప్రజల కైఇదివరకు ఎరుగనటువంటి సౌలభ్యాన్ని మరియు సౌకర్యాన్ని ప్రసాదిస్తున్నాయి’’
Posted On:
23 DEC 2021 3:11PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారాణసీ లోని కార్ ఖియాం లో గల యుపి స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ ఆథారిటి ఫూడ్ పార్క్ లో ‘బనాస్ డెయరీ సంకుల్’ కు శంకుస్థాపన చేశారు. 30 ఎకరాల లో ఏర్పాటయ్యే ఈ పాడి కేంద్రాన్ని సుమారు 475 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మించడం జరుగుతుంది. ఈ కేంద్రం ప్రతి ఒక్క రోజు లో 5 లక్షల లీటర్ల పాల ను శుద్ధి చేసే సదుపాయాన్ని కలిగి ఉంటుంది. ప్రధాన మంత్రి బనాస్ డెయరీ తో అనుబంధం కలిగి ఉన్న 1.7 లక్షల కు పైగా పాల ఉత్పత్తిదారుల బ్యాంకు ఖాతాల లోకి దాదాపు గా 35 కోట్ల రూపాయల బోనస్ రాశి ని డిజిటల్ మాధ్యమం ద్వారా బదిలీ చేశారు. వారాణసీ లోని రామ్ నగర్ లో గల పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ప్లాంటు కోసం నిర్మించతలపెట్టిన బయోగ్యాస్ ఆధారిత విద్యుత్తు ఉత్పత్తి ప్లాంటు కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రధాన మంత్రి ఒక లోగో ను మరియు జాతీయ పాడి అభివృద్ధి మండలి (ఎన్ డిడిబి) సహాయం తో భారతీయ ప్రమాణాల మండలి (బిఐఎస్) అభివృద్ధి పరచిన ఒక పోర్టల్ ను, లోగో ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ను, లోగో ను పాల ఉత్పత్తుల కన్ ఫార్మిటి అసెస్ మెంట్ స్కీము కు అంకితం చేయడమైంది.
క్షేత్ర స్థాయి లో భూమి యాజమాన్యం తాలూకు సమస్యల ను తగ్గించే మరో ప్రయాస లో భాగం గా, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన 20 లక్షల మంది కి పైగా నివాసుల కు పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లోని ‘స్వామిత్వ పథకం’లో భాగం గా గ్రామీణ నివాస హక్కుల పత్రం అయినటువంటి ‘ఘరౌనీ’ ని ప్రధాన మంత్రి వర్చువల్ పద్ధతి లో పంపిణీ చేశారు.
ఇదే కార్యక్రమం లో ప్రధాన మంత్రి 1500 కోట్ల రూపాయల కు పైగా విలువైన అభివృద్ధి పథకాల ను ప్రారంభించడం తో పాటు, కొన్నిపథకాల కు శంకుస్థాపన కూడా చేశారు. ఇది వారాణసీ సంపూర్ణ పరివర్తన కై ప్రస్తుతం కొనసాగుతున్న ప్రక్రియ ను మరింత పటిష్ట పరచనుంది.
ఈ సందర్భం లో పాలుపంచుకున్న వారి లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండేయ లు ఉన్నారు.
సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, పూర్వ ప్రధాని కీర్తి శేషుడు చౌధరీ చరణ్ సింహ్ జయంతి కావడం తో ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించారు. చౌధరీ చరణ్ సింహ్ జయంతి నాడు కిసాన్ దివస్ గా జరుపుకోవడం ఆనవాయితీ గా ఉంది.
పశు గణానికి ఉన్నప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ‘‘గోవుల ను గురించి మాట్లాడటం అనేది కొందరి విషయం లో ఒక నేరం అయితే కావచ్చు, గోవుల ను మనం మాతలు గా పూజిస్తాం. గోవు- గేదె ను గేలి చేసే వారు దేశం లో 8 కోట్ల కుటుంబాల కు జీవనోపాధి ని అందిస్తున్నది ఆ పశుగణమే అనే సంగతి ని మరచి పోతున్నారు’’ అని ఆయన అన్నారు. ‘‘భారతదేశం లో పాడి రంగాన్ని బలపరచడం అనేది మా ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యాల లో ఒకటి గా ఉంది. ఈ పరంపర లో ఈ రోజు న, ఇక్కడ బనాస్ కాశీ సంకుల్ కు పునాది రాయి ని వేయడం జరిగింది’’ అని ఆయన అన్నారు. పశువుల లో గాలికుంటు వ్యాధి నివారణ కు దేశమంతటా టీకాకరణ కార్యక్రమం అమలవుతున్న విషయాన్ని గురించి కూడా ఆయన ప్రస్తావించారు. దేశం లో పాల ఉత్పత్తి ఆరేడేళ్ళ కిందటి తో పోలిస్తే సుమారు గా 45 శాతం మేర కు వృద్ధి చెందింది. ప్రస్తుతం భారతదేశం ప్రపంచం లో ఉత్పత్తి అవుతున్న పాల లో రమారమి 22 శాతం పాల ను ఉత్పత్తి చేస్తున్నది. ‘‘ఉత్తర్ ప్రదేశ్ ప్రస్తుతం దేశం లో పాల ను అత్యధికం గా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం గా మాత్రమే కాకుండా, పాడి రంగం విస్తరణ లో గణనీయమైనటువంటి పురోగతి ని కూడా సాగిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
పాడి రంగం యొక్క పాత్ర పట్ల, పశు ధనం పట్ల మరియు రైతుల జీవనం లో పరివర్తన ను తీసుకు రావడం లో శ్వేత క్రాంతి పోషిస్తున్న పాత్ర పట్ల ప్రధాన మంత్రి దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఒకటో విషయం గా ఆయన పశు పోషణ అనేది దేశం లో 100 మిలియన్ కు పైబడిన చిన్న రైతుల కు అదనపు ఆదాయాన్ని అందించే ఒక భారీ వనరు గా మారగలదు అన్నారు. రెండో విషయం ఏమిటి అంటే అది భారతదేశాని కి చెందిన పాడి ఉత్పత్తుల కు విదేశాల లో పెద్ద బజారు ఉంది, మరి ఈ విషయం లో మరింత గా ఎదిగేందుకు అవకాశం సైతం ఉండడమే అన్నారు. మూడో విషయం ఏమిటి అంటే పశు పోషణ అనేది మహిళల ఆర్థిక అభ్యున్నతి కి, వారి లో నవపారిశ్రామికత్వాని కి దన్ను గా నిలవడాని కి ఒక గొప్పమార్గం గా ఉందనేదే అని ప్రధాన మంత్రి అన్నారు. పశు సంపద అనేది బయోగ్యాస్ కు, సేంద్రియ వ్యవసాయాని కి, ఇంకా ప్రాకృతిక వ్యవసాయాని కి కూడాను ఒక పెద్ద ప్రాతిపదిక గా ఉండటం అనేది నాలుగో పార్శ్వం అన్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ దేశాని కి ఒక ఏకీకృత వ్యవస్థ ను ఇచ్చిందన్నారు. ధ్రువపత్రాల జారీ ప్రక్రియ కోసం కామధేను గోవు ల చిత్రం తో కూడిన ఒక సమీకృత అధికార చిహ్నాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రుజువు, ఈ లోగో కనపడింది అంటే గనుక అప్పుడు శుద్ధత తాలూకు గుర్తింపు అనేది సులభం అయిపోతుంది. మరి భారతదేశం పాల ఉత్పత్తుల విశ్వసనీయత కూడా పెరుగుతుంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
ప్రాకృతిక వ్యవసాయాని కి తాను కట్టబెడుతున్న ప్రాధాన్యాన్ని గురించి ప్రధాన మంత్రి మరింత గా వివరిస్తూ, కాలం గడచిపోయిన కొద్దీ ప్రాకృతిక వ్యవసాయం తాలూకు పరిధి కుచించుకుపోయింది. రసాయనిక వ్యవసాయానిదే పై చేయి అయింది అన్నారు. పుడమి తల్లి కి తిరిగి శక్తి ని ఇవ్వడం కోసం, మన నేల ను కాపాడుకోవడం కోసం, భావి తరాల భవిష్యత్తు ను భద్రం గా ఉంచడం కోసం మనం మరోసారి ప్రాకృతిక వ్యవసాయం దిశ లో అడుగులు వేయవలసిందే. ఇదే ప్రస్తుత తక్షణావసరం అని ఆయన అన్నారు. ప్రాకృతిక వ్యవసాయం వైపునకు కదలవలసింది గా, సేంద్రియ పంటల ను సాగు చేయవలసింది గా రైతుల కు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. మన వ్యవసాయాన్ని స్వయం సమృద్ధం గా తీర్చిదిద్దడం లో ఇది ఒక ప్రముఖ పాత్ర ను పోషించ గలుగుతుంది అని ఆయన అన్నారు.
కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కు చెందిన ‘స్వామిత్వ పథకం’ లో భాగం గా ఉత్తర్ ప్రదేశ్ లో 20 లక్షల కు పైగా నివాసుల కు గ్రామీణ ఆవాస హక్కుల పత్రం అయినటువంటి ‘ఘరౌని’ ని ప్రధాన మంత్రి వర్చువల్ పద్ధతి లో పంపిణీ చేశారు. ఇది గ్రామీణ పేదల కు హోదా ను ఇచ్చి, అభివృద్ధి తాలూకు సరికొత్త దృశ్యాల ను ఆవిష్కరిస్తుందని, అంతేకాకుండా వారి ని ప్రగతి గాథ లో భాగస్తుల ను చేస్తుందని ఆయన అన్నారు.
వారాణసీ ఒక అభివృద్ధి నమూనా గా దూసుకు పోతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. కొత్త కొత్త ప్రాజెక్టు లు వారాణసీ ప్రజల కు ఇంతకుముందు ఎరుగని సౌలభ్యం తో సౌకర్యాన్ని ప్రసాదిస్తున్నాయన్నారు. ఈ రోజు న ప్రారంభించిన, మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఆరోగ్యం, విద్య, ఇంకా మౌలిక సదుపాయాల కు సంబంధించిన ప్రతిష్ట ను ఇనుమడింప జేస్తాయి అని ఆయన చెప్పారు.
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల ను కులం, వర్గం, ప్రాంతం అనేటటువంటి పట్టకం ద్వారా చూసిన మనుషులు జోడు ఇంజిన్ తాలూకు రెట్టింపు శక్తి అనే చర్చ ను విని నిరాశ కు లోనవుతారు అని ప్రధాన మంత్రి అన్నారు. అటువంటి మనుషులు పాఠశాలల ను, కళాశాలల ను, రహదారుల ను, జలాన్ని, పేదల కు గృహనిర్మాణాన్ని, గ్యాస్ కనెక్శన్ లను, ఇంకా టాయిలెట్ లను అభివృద్ది లో భాగం అని భావించరు అని ఆయన అన్నారు. ‘‘ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రజలు ఇదివరకు పొందింది ఏమిటి?, మరి ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు మా ప్రభుత్వం నుంచి ప్రస్తుతం పొందుతున్నది ఏమిటి? అనే రెండు అంశాల కు మధ్య గల తేడా స్పష్టం. మేం ఉత్తర్ ప్రదేశ్ వారసత్వాన్ని వృద్ధిచెందింప చేస్తున్నాం, అలాగే మేం యుపి ని అభివృద్ధి పరుస్తున్నాం కూడా’’ అంటూ ప్రధాన మంత్రి తన ఉపన్యాసాన్ని ముగించారు.
ప్రధాన మంత్రి ప్రారంభించిన విద్య రంగ పథకాల లో కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ కు చెందిన ఇంటర్ యూనివర్సిటి సెంటర్ ఫార్ టీచర్స్ ఎడ్ యుకేశన్ (దీనిని సుమారు 107 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించడమైంది), సెంట్రల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ హయ్యర్ టిబెటన్ స్టడీస్ కు చెందిన ఒక టీచర్స్ ఎడ్ యుకేశన్ సెంటర్ (దీనిని 7 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో నిర్మించడం జరిగింది) ఉన్నాయి. వీటి కి అదనం గా, బిహెచ్ యు లోను, ఐటిఐ కరౌందీ లోను సిబ్బంది నివాస సముదాయం, ఇంకా కొన్ని నివాస గృహాల ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు.
ఆరోగ్య రంగం లో, మహామనా పండిత్ మదన్ మోహన్ మాలవీయ కేన్సర్ సెంటర్ లో 130 కోట్ల రూపాయల విలువ కలిగన డాక్టర్ ల వసతి గృహం, నర్సు ల వసతి గృహం, ఒక శెల్టర్ హోమ్ వంటి ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఆయన భద్రాసీ లో 50 పడకల తో కూడిన ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ ను ప్రారంభించారు. అలాగే పిండ్ రా తహసీల్ లో 49 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించేటటువంటి ఒక ప్రభుత్వ హోమియోపతి వైద్య చికిత్స కళాశాల కు ఆయన శంకుస్థాపన చేశారు.
రహదారి రంగం విషయానికి వస్తే, ప్రధాన మంత్రి ప్రయాగ్ రాజ్,ఇంకా భదోహీ లకు పోయే రహదారుల ను ‘4 దోవల నుంచి 6 దోవల’ కు విస్తరించే ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేశారు. ఇవి వారాణసీ కి సంధానాన్ని మెరుగు పరచనున్నాయి. అంతేగాక, నగరం లో వాహనాల రాకపోకల లో ప్రతిష్టంభన సమస్య ను పరిష్కరించే దిశ లో ఒక అడుగు పడినట్లు కూడా అవుతుంది.
పవిత్ర కాశీ నగరం యొక్క పర్యటన సామర్ధ్యానికి దన్ను గా నిలవడం కోసం శ్రీ గురు రవిదాస్ జీ ఆలయం, రుషి గోవర్ధన్ కు సంబంధించిన పర్యటన అభివృద్ధి పథకం యొక్క ఒకటో దశ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు.
ప్రధాన మంత్రి ప్రారంభించిన ఇతర ప్రాజెక్టుల లో వారాణసీ లోని దక్షిణ ఆసియా ప్రాంతీయ కేంద్రానికి చెందిన అంతర్జాతీయ వరి పరిశోదన సంస్థ లో ఓ స్పీడ్ బ్రీడింగ్ ఫెసిలిటి, పాయక్ పుర్ గ్రామం లో ఒక రీజినల్ రెఫరన్స్ స్టాండర్డ్ స్ లబారటరీ లతో పాటు పిండ్ రా తహసీల్ లో ఒక అడ్వకేట్ బిల్డింగ్ లు కూడా ఉన్నాయి.
आज देश के पूर्व प्रधानमंत्री चौधरी चरण सिंह जी की जन्मजयंती है।
उनकी स्मृति में देश, किसान दिवस मना रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 23, 2021
हमारे यहां गाय की बात करना, गोबरधन की बात करना कुछ लोगों ने गुनाह बना दिया है।
गाय कुछ लोगों के लिए गुनाह हो सकती है, हमारे लिए गाय, माता है, पूजनीय है।
गाय-भैंस का मजाक उड़ाने वाले लोग ये भूल जाते हैं कि देश के 8 करोड़ परिवारों की आजीविका ऐसे ही पशुधन से चलती है: PM
— PMO India (@PMOIndia) December 23, 2021
भारत के डेयरी सेक्टर को मजबूत करना, आज हमारी सरकार की सर्वोच्च प्राथमिकताओं में से एक है।
इसी कड़ी में आज यहां बनास काशी संकुल का शिलान्यास किया गया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 23, 2021
6-7 वर्ष पहले की तुलना में देश में दूध उत्पादन लगभग 45 प्रतिशत बढ़ा है।
आज भारत दुनिया का लगभग 22 प्रतिशत दूध उत्पादन करता है।
मुझे खुशी है कि यूपी आज देश का सबसे अधिक दूध उत्पादक राज्य तो है ही, डेयरी सेक्टर के विस्तार में भी बहुत आगे है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 23, 2021
मेरा अटूट विश्वास है कि देश का डेयरी सेक्टर, पशुपालन, श्वेत क्रांति में नई ऊर्जा, किसानों की स्थिति को बदलने में बहुत बड़ी भूमिका निभा सकती है।
इस विश्वास के कई कारण भी हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 23, 2021
पहला ये कि पशुपालन, देश के छोटे किसान जिनकी संख्या 10 करोड़ से भी अधिक है, उनकी अतिरिक्त आय का बहुत बड़ा साधन बन सकता है।
दूसरा ये कि भारत के डेयरी प्रॉडक्ट्स के पास, विदेशों का बहुत बड़ा बाजार है जिसमें आगे बढ़ने की बहुत सारी संभावनाएं हमारे पास हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 23, 2021
तीसरा ये कि पशुपालन, महिलाओं के आर्थिक उत्थान, उनकी उद्यमशीलता को आगे बढ़ाने का बहुत बड़ा जरिया है।
और चौथा ये कि जो हमारा पशुधन है, वो बायोगैस, जैविक खेती, प्राकृतिक खेती का भी बहुत बड़ा आधार है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 23, 2021
भारतीय मानक ब्यूरो ने देशभर के लिए एकीकृत व्यवस्था जारी की है।
सर्टिफिकेशन के लिए कामधेनु गाय की विशेषता वाला एकीकृत LOGO भी लॉन्च किया गया है।
ये प्रमाण, ये LOGO दिखेगा तो शुद्धता की पहचान आसान होगी और भारत के दूध उत्पादों की विश्वसनीयता भी बढ़ेगी: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 23, 2021
समय के साथ प्राकृतिक खेती का दायरा सिमटता गया, उस पर केमिकल वाली खेती हावी होती गई।
धरती मां के कायाकल्प के लिए, हमारी मिट्टी की सुरक्षा के लिए, आने वाली पीढ़ियों के भविष्य को सुरक्षित रखने के लिए, हमें एक बार फिर प्राकृतिक खेती की तरफ मुड़ना ही होगा।
यही आज समय की मांग है: PM
— PMO India (@PMOIndia) December 23, 2021
समय के साथ प्राकृतिक खेती का दायरा सिमटता गया, उस पर केमिकल वाली खेती हावी होती गई।
धरती मां के कायाकल्प के लिए, हमारी मिट्टी की सुरक्षा के लिए, आने वाली पीढ़ियों के भविष्य को सुरक्षित रखने के लिए, हमें एक बार फिर प्राकृतिक खेती की तरफ मुड़ना ही होगा।
यही आज समय की मांग है: PM
— PMO India (@PMOIndia) December 23, 2021
सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास की ये भाषा भी उनके सिलेबस से बाहर है।
उनके सिलेबस में है- माफियावाद, परिवारवाद।
उनके सिलबस में है- घरों-जमीनों पर अवैध कब्जा: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 23, 2021
इन लोगों ने कभी नहीं चाहा कि यूपी का विकास हो, यूपी की आधुनिक पहचान बने।
स्कूल, कॉलेज, अस्पताल, सड़क, पानी, बिजली, गरीबों के घर, गैस कनेक्शन, शौचालय, इनको तो वो विकास मानते ही नहीं: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 23, 2021
मैं जब काशी के, उत्तर प्रदेश के विकास में डबल इंजन की डबल शक्ति और डबल विकास की बात करता हूं, तो कुछ लोगों को बहुत कष्ट होता है।
ये वो लोग हैं जिन्होंने उत्तर प्रदेश की राजनीति को सिर्फ जाति, पंथ, मत-मज़हब के चश्मे से ही देखा: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 23, 2021
पहले की सरकारों के समय यूपी के लोगों को जो मिला और आज यूपी के लोगों को हमारी सरकार से जो मिल रहा है, उसका फर्क साफ है।
हम यूपी में विरासत को भी बढ़ा रहे हैं, यूपी का विकास भी कर रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 23, 2021
***
DS/AK
(Release ID: 1784683)
Visitor Counter : 197
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam