మంత్రిమండలి

కేన్-బేత్వా నదుల ను రెంటిని ఒకదానితో మరొక దానిని కలపడానికి ఉద్దేశించిన పథకాని కి ఆమోదంతెలిపిన మంత్రిమండలి


ఈ పథకాని కి44,605 కోట్ల రూపాయలు ఖర్చు కావచ్చు; ఈ పథకాన్ని 8 సంవత్సరాల లో పూర్తి చేయడం జరుగుతుంది

ఈ పథకం ద్వారా103 మెగావాట్ జల విద్యుత్తు తో పాటు 27 మెగావాట్ సౌర శక్తి ఉత్పత్తి అవుతుంది

ఈ పథకం ద్వారా103 మెగావాట్ జల విద్యుత్తు తో పాటు 27 మెగావాట్ సౌర శక్తి ఉత్పత్తి అవుతుంది

ఈ పథకంద్వారా మధ్య ప్రదేశ్ లోని ఛతర్ పుర్, పన్నా, ఇంకా టీకమ్ గఢ్ లు మరియు ఉత్తర్ ప్రదేశ్ లోని బాందా, మహోబా మరియు ఝాంసీ ల లో చాలా కాలం గా అనావృష్టి బారి నపడుతున్న ప్రాంతాల లోను,  నీటి ఎద్దడి ప్రాంతాల లోను 10.62 లక్షల హెక్టేర్ల ప్రాంతాని కి సేద్యపు నీటి సదుపాయం లభిస్తుంది

62 లక్షల మందికి తాగునీటి ని అందుబాటులోకి తీసుకు రావడం కోసం కాలువ ను జోడించడం జరుగుతుంది

Posted On: 08 DEC 2021 4:33PM by PIB Hyderabad

కేన్-బేత్ వా నదులను రెంటిని ఒకదానితో మరొక దానిని జోడించే పథకాని కి ఆర్థిక సహాయాన్ని అందించడం తో పాటు, ఆ పథకాన్ని అమలు పరచడానికి కూడాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ఆమోదాన్ని తెలిపింది.

కేన్-బేత్ వా లింక్ ప్రాజెక్టు కు మొత్తం 44,605 కోట్ల రూపాయలు ఖర్చు కావచ్చని అంచనా వేయడమైంది. ఈ లెక్క ను 2020-21 ధరల ఆధారం గా కట్టడం జరిగింది. ఈ పథకాని కి 39,317 కోట్ల రూపాయల ను సెంట్రల్ సపోర్ట్ రూపం లోను, 36,290 కోట్ల రూపాయల ను కవరింగ్ గ్రాంట్ రూపం లోను, 3,027 కోట్ల రూపాయల ధనరాశి ని రుణం రూపం లోను ఇవ్వడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది.

ఈ పథకం భారతదేశం లో మరిన్ని నదులను ఒకదానితో మరొక దానిని జోడించే ఇతర పథకాల కు కూడా బాట ను పరచనుంది. అంతేకాక, మన యొక్క కార్యకుశలత ను మరియు దృష్టి కోణాన్ని ప్రపంచాని కి కూడా చాటి చెబుతుంది.

ఈ పథకం లో భాగం గా కేన్ యొక్క జలాల ను బేత్ వా నది లోకి పంపించడం జరుగుతుంది. ఈ కార్యాన్ని దావూధామ్ ఆనకట్ట ను నిర్మించడం తో పాటు రెండు నదుల ను కాలువ తో కలిపే, దిగువ ఆర్ పథకం, కోఠా బరాజు, అలాగే బీనా కాంప్లెక్స్ పథకం ల ద్వారా పూర్తి చేయడం జరుగుతుంది. పథకం ద్వారా 10.62 లక్షల హెక్టేర్ ల ప్రాంతాతనికి ఏటా సేద్యపు నీరు లభిస్తుంది. దీని తో పాటు సుమారు గా 62 లక్షల మంది జనాభా కు తాగునీరు అందుతుంది. దీనికి అదనం గా 103 మెగావాట్ జల విద్యుత్తు ను, 27 మెగావాట్ సౌర శక్తి ని ఉత్పత్తి చేసేందుకు వీలు పడుతుంది. ఈ పథకాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో 8 సంవత్సరాల లో అమలు చేయాలని ప్రతిపాదించడమైంది.

ఈ పథకం నీటి కోసం అల్లాడుతున్న బుందేల్ ఖండ్ ప్రాంతానికి ఎంతో ప్రయోజనకారి అవుతుంది. ఈ ప్రాంతం అంతా మధ్య ప్రదేశ్ మరియు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల లో విస్తరించి ఉంది. ఈ పథకం ద్వారా మధ్య ప్రదేశ్ లోని పన్నా, టీకమ్ గఢ్, ఛతర్ పుర్, సాగర్, దమోహ్, దతియా, విదిశా, శివ్ పురి జిల్లాల కు, ఇంకా రాయ్ సేన్ లతో పాటు ఉత్తర్ ప్రదేశ్ లోని బాందా, మహోబా, ఝాంసీ మరియు లలిత్ పుర్ లకు పెద్ద ఎత్తు న లబ్ధి కలుగుతుంది.

ఈ పథకం ద్వారా వ్యావసాయిక కార్యకలాపాలు పెరిగి, ఉపాధి కల్పన కు ఆస్కారం ఏర్పడి బుందేల్ ఖండ్ లోని వెనుకబడిన ప్రాంతం లో సామాజిక, ఆర్థిక సమృద్ధి జోరు అందుకొంటుందన్న అంచనా ఉన్నది. ఈ ప్రాంతం లో ప్రజలు నిరుత్సాహానికి లోనై ప్రవాసం పోకుండా వారిని ఆపడం లో ఈ పథకం దోహదం చేయగలదు.

ఈ పథకం పర్యావరణ సంబంధి నిర్వహణ కు మరియు జాగ్రత చర్యల కు భారీ ఎత్తు న తోడ్పడగలదు. ఈ ఉద్దేశ్యం నెరవేరడం కోసం వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒక సమగ్రమైనటువంటి ల్యాండ్ స్కేప్ మేనేజ్ మెంట్ ప్లాను కు తుదిరూపాన్ని ఇచ్చే పని లో తలమునకలు గా ఉంది.

పూర్వరంగం:

దేశం లో నదుల ను పరస్పరం ఒకదాని తో మరొక దాని ని జోడించే మొట్టమొదటి ప్రముఖ కేంద్రీయ పథకాన్ని అమలుపరచడం కోసం ఒక భారీ నదుల అనుసంధాన పథకాన్ని అమలు లోకి తీసుకు రావడానికి ఒక చరిత్రాత్మకమైన ఒప్పంద పత్రం పైన జల శక్తి శాఖ కేంద్ర మంత్రి, మధ్య ప్రదేశ్, ఇంకా ఉత్తర్ ప్రదేశ్ ల ముఖ్యమంత్రులు 2021 వ సంవత్సరం మార్చి నెల 22 వ తేదీన సంతకాలు చేశారు. ఈ ఒప్పందం జలాల ను మిగులుగా ఉన్నటువంటి ప్రాతాల నుంచి కరవు బాధిత ప్రాంతాల కు, జల సౌకర్యం లోపించిన ప్రాంతాల కు తరలించడానికి సంబంధించి శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ దార్శనికత ను సాకారం చేయడం కోసం అంతర్ రాష్ట్ర సహకారాన్ని వినియోగించుకోవాలన్న సంకల్పాన్ని నెరవేర్చే దిశ లో ముందడుగా గా ఉంది.

***



(Release ID: 1779411) Visitor Counter : 211