ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ తెలుగు సినిమా పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతికి ప్రధానమంత్రి సంతాపం
प्रविष्टि तिथि:
30 NOV 2021 8:20PM by PIB Hyderabad
ప్రసిద్ధ తెలుగు సినిమా పాటల రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో-
“అద్భుత ప్రతిభాశాలి శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారు కన్నుమూశారన్న వార్త నన్నెంతో బాధించింది. ఆయన కలం నుంచి జాలువారిన అనేక రచనలలో కవితా వైభవం పరిమళించడంతోపాటు ఆయన బహుముఖ ప్రజ్ఞ స్పష్టంగా కనిపిస్తూంటుంది. తెలుగు భాషకు ప్రాచుర్యం కల్పించడం కోసం ఆయన ఎనలేని కృషి చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు ఈ సందర్భంగా నా సానుభూతి తెలియజేస్తున్నాను… ఓం శాంతి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.”
***
DS/SH
(रिलीज़ आईडी: 1776664)
आगंतुक पटल : 190
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam