ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

ప్రధానమంత్రి నవంబర్ 19న ఉత్తర్ప్రదేశ్ ను సందర్శించనున్నారు;   6250 కోట్లరూపాయల కు పైగా విలువైన అనేక అభివృద్ధి పథకాల ను ఆయన ప్రారంభిస్తారు


నీటి ఎద్దడిని దూరం చేసేందుకు, రైతుల కు అవసరమైనఉపశమనాన్ని అందించేందుకు మహోబా లో అనేక పథకాల ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు

ఝాంసీ లో 600 మెగావాట్ అల్ట్రా మెగా సోలర్ పవర్ పార్క్ కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు; అటల్ ఏక్ తా పార్కు ను కూడా ఆయన ప్రారంభిస్తారు   

Posted On: 17 NOV 2021 1:59PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 నవంబర్ 19 న ఉత్తర్ ప్రదేశ్ లో మహోబా, ఇంకా ఝాంసీ జిల్లాల ను సందర్శించనున్నారు.

 

నీటి సమస్య ను దూరం చేయడం కోసం చేపట్టే ఒక ముఖ్యమైన కార్యక్రమం లో భాగం గా మధ్యాహ్నం సుమారు 2 గంటల 45 నిమిషాల వేళ కు మహోబా లో పలు పథకాల ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఈ పథకాలతో ఆ ప్రాంతం లో నీటి ఎద్దడి సమస్య నివారణ కు సహాయం లభించడం తో పాటు రైతుల కు అవసరమైన ఉపశమనం కూడా ప్రాప్తిస్తుంది. ఈ పథకాల లో అర్జున్ సహాయక్ ప్రాజెక్టు, రతౌలీ వియర్ ప్రాజెక్టు, భవానీ డ్యామ్ ప్రాజెక్టు, మఝ్ గాఁవ్-చిల్లీ స్ప్రింక్లర్ ప్రాజెక్టు వంటివి కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు అన్నిటికి కలిపి మొత్తం వ్యయం 3250 కోట్ల రూపాయల పై చిలుకు అవుతుంది. వీటి నిర్మాణం పూర్తి అయిందంటే గనక మహోబా, హమీర్ పుర్, బాందా, లలిత్ పుర్ జిల్లాల లో దాదాపు గా 65,000 హెక్టేయర్ భూమి లో సేద్యాని కి సహకారం అందుతుంది. దీనితో ఆ ప్రాంతం లో లక్షల కొద్దీ రైతులు ప్రయోజనాన్ని అందుకోగలుగుతారు. ఈ ప్రాజెక్టులతో ఆ ప్రాంతం లో తాగునీరు కూడా సమకూరుతుంది.

 

ప్రధాన మంత్రి సాయంత్రం పూట దాదాపు 5 గంటల 15 నిమిషాల కు ఝాంసీ లోని గరౌఠా లో 600 ఎమ్ డబ్ల్యు అల్ట్రా మెగా సోలర్ పవర్ పార్క్ కు శంకుస్థాపన చేయనున్నారు. 3,000 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో దీనిని నిర్మించడం జరుగుతున్నది. మరి ఇది చౌకగా విద్యుత్తు ను సమకూర్చడం తో పాటు గ్రిడ్ కు స్థిరత్వాన్ని సైతం అందించడం లో సాయపడనుంది.

 

ప్రధాన మంత్రి ఝాంసీ లో అటల్ ఏక్ తా పార్కు ను కూడా ప్రారంభిస్తారు. ఈ పార్కు కు పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ పేరు ను పెట్టడం జరిగింది. ఈ పార్కు ను 11 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో నిర్మించడమైంది. ఇది సుమారు 40,000 చదరపు మీటర్ క్షేత్రం లో విస్తరించి ఉంది. దీని లో ఒక గ్రంథాలయం తో పాటు శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ విగ్రహం కూడా ఉంది. ఈ విగ్రహాన్ని ప్రసిద్ధ శిల్పి శ్రీ రామ్ సుతార్ నిర్మించారు. ఇంతకు ముందు, శ్రీ రామ్ సుతార్ ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ని రూపుదిద్దడం లోనూ తోడ్పడ్డారు.

 

 

***



(Release ID: 1772662) Visitor Counter : 183