ప్రధాన మంత్రి కార్యాలయం
భోపాల్‌లో పునర్నిర్మించిన రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని
ఉజ్జయిని-ఇండోర్ మధ్య రెండు కొత్త ‘మెము’ రైళ్లకు ప్రధాని పచ్చజెండా
మధ్యప్రదేశ్‌లో రైల్వేలకు చెందిన పలు పనులకు ప్రధానమంత్రి శ్రీకారం
Posted On:
14 NOV 2021 4:07PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 నవంబర్ 15న మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్న సందర్భంగా పునర్నిర్మించిన రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌ను మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తారు. గోండు రాజ్యాన్నేలిన సాహస వనిత, భయమంటే ఏమిటో ఎరుగని రాణి కమలాపతి పేరిట పునర్నిర్మితమైన ‘రాణి కమలాపతి రైల్వే స్టేషన్’ మధ్యప్రదేశ్‌లోని తొలి అంతర్జాతీయ స్థాయి రైల్వే స్టేషన్ కావడం విశేషం. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం నమూనాతో పునర్నిర్మించిన ఈ స్టేషన్ ప్రపంచ స్థాయి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన హరిత సౌధంగా తీర్చిదిద్దబడింది. ముఖ్యంగా ఈ భవన నిర్మాణంలో దివ్యాంగుల రాకపోకల సౌలభ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ స్టేషన్‌ను సమీకృత బహుళ-రవాణా సదుపాయ కేంద్రంగానూ రూపొందించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మధ్యప్రదేశ్‌లో రైల్వేశాఖకు చెందిన పలు కార్యక్రమాలకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం చేస్తారు. ముఖ్యంగా గేజ్ మార్పిడి, విద్యుదీకరణ పూర్తిచేసిన ఉజ్జయిని-ఫతేబాద్ చంద్రావతిగంజ్ బ్రాడ్‌గేజ్ సెక్షన్, భోపాల్-బర్ఖెరా మార్గంలో మూడో లైన్‌ను, గేజ్ మార్పిడి, విద్యుదీకరణ పూర్తిచేసిన మథెలా-నిమర్ ఖేరీ బ్రాడ్‌గేజ్ మార్గాలుసహా విద్యుదీకరించిన గుణ-గ్వాలియర్ మార్గాన్ని జాతికి అంకితం చేస్తారు. ఉజ్జయిని-ఇండోర్; ఇండోర్-ఉజ్జయిని మధ్య రెండు కొత్త ‘మెము’ రైళ్లను కూడా ప్రధానమంత్రి పచ్చజెండా ఊపి సాగనంపుతారు.
***
(Release ID: 1771783)
Visitor Counter : 181
Read this release in:
English
,
Gujarati
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam