ప్రధాన మంత్రి కార్యాలయం

త్రిపురలోని 1.47 లక్షల మంది లబ్ధిదారులకు ‘పీఎంఏవై-జి’ తొలివిడత నిధులను నవంబరు 14న విడుదల చేయనున్న ప్రధానమంత్రి

Posted On: 13 NOV 2021 5:11PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2021 నవంబర్ 14న త్రిపురలోని 1.47 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ (పీఎంఏవై-జి) తొలివిడత నిధులను బదిలీ చేస్తారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా మధ్యాహ్నం ఒంటిగంటకు రూ.700 కోట్లకు పైగా సొమ్మును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. ప్రధానమంత్రి చొరవతో త్రిపుర విశిష్ట భౌగోళిక-వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేకించి ఆ రాష్ట్రం కోసం ‘కచ్చా ఇల్లు’ పదానికి నిర్వచనాన్ని ప్రభుత్వం మార్పుచేసింది. దీంతో ఆ రాష్ట్రంలో ‘కచ్చా ఇళ్ల’లో నివసించే ప్రజలు పెద్దసంఖ్యలో ‘పక్కా ఇళ్ల’ లబ్ధిదారులు కాగలిగారు.

ఈ మేరకు వారు ‘పక్కా’ ఇళ్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం లభిస్తోంది. కాగా, నిధుల విడుదల కార్యక్రమంలో త్రిపుర ముఖ్యమంత్రితోపాటు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి   కూడా పాల్గొంటారు.

 

***



(Release ID: 1771620) Visitor Counter : 153