ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యు.కె. లోని గ్లాస్గో లో సి.ఓ.పి-26 సందర్భంగా శ్రీ బిల్ గేట్స్‌ తో సమావేశమైన - ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 02 NOV 2021 7:58PM by PIB Hyderabad

యునైటెడ్ కింగ్‌ డమ్‌ లోని గ్లాస్గో లో సి.ఓ.పి-26 సదస్సు నేపథ్యంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2021 నవంబర్, 2వ తేదీన, శ్రీ బిల్ గేట్స్‌ ను కలిశారు.

భారతదేశంలో బిల్ మరియు మెలిండా గేట్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని, ప్రధానమంత్రి ప్రశంసించారు.   మిషన్ ఇన్నోవేషన్ పురోగతిని బిల్ గేట్స్ ప్రధానమంత్రి కి వివరించారు.  మిషన్ ఇన్నోవేషన్ కింద భారతదేశంలో కార్యకలాపాలను వేగవంతం చేయడానికి తీసుకోవలసిన చర్యలపై వారు చర్చించారు.

గ్రీన్ హైడ్రోజన్, విమాన ఇంధనాలు, బ్యాటరీ నిల్వ తో సహా, వ్యాక్సిన్ పరిశోధన వంటి రంగాల్లో మంచి అవకాశాల గురించి కూడా వారు చర్చించారు.

 

*****


(रिलीज़ आईडी: 1769053) आगंतुक पटल : 191
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam