ప్రధాన మంత్రి కార్యాలయం

ఎయిమ్స్ న్యూ ఢిల్లీ కి చెందిన ఝజ్జర్ కేంపస్ లో నేశనల్ కేన్సర్ ఇన్స్ టిట్యూట్‌ లో ఇన్ఫోసిస్ ఫౌండేశన్ విశ్రామ్ సదన్‌ ను అక్టోబరు 21 న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

Posted On: 20 OCT 2021 4:15PM by PIB Hyderabad

ఎఐఐఎమ్ఎస్ (ఎయిమ్స్) న్యూ ఢిల్లీ కి చెందిన ఝజ్జర్ ప్రాంగణం లో నెలకొన్న నేశనల్ కేన్సర్ ఇన్స్ టిట్యూట్ (ఎన్‌ సిఐ) లో ఇన్ఫోసిస్ ఫౌండేశన్ విశ్రాంతి సదన్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 అక్టోబర్ 21 న ఉదయం 10 గంటల 30 నిమిషాలకు వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ఆ తరువాత ఈ సందర్భం లో ఆయన ప్రసంగం కూడా ఉండబోతున్నది.

ఇన్ఫోసిస్‌ ఫౌండేశన్‌ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిర్వహణ లో ఓ భాగం గా 806 పడకలు కలిగిన విశ్రాంతి సదన్ ను నిర్మించింది. కేన్సర్‌ రోగుల కు సహాయం గా దీర్ఘకాలం పాటు ఆసుపత్రులలో ఉండవలసి వచ్చేటటువంటి వ్యక్తుల కోసం ఎయిర్‌కండిశన్‌ సౌకర్యం తో కూడిన వసతి ని కల్పించడం దీని ఉద్దేశ్యం గా ఉంది. 93 కోట్ల రూపాయల ఖర్చు తో ఇన్ఫోసిస్‌ ఫౌండేశన్‌ ఈ సదన్ ను నిర్మించింది. ఈ సదన్ ఎన్‌ సిఐ యొక్క ఆసుపత్రి మరియు ఒపిడి బ్లాకుల కు అతి దగ్గర లో ఉంది.

ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి శ్రీ మన్‌ సుఖ్‌ మాండవీయ, హరియాణా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ లతో పాటు ఇన్ఫోసిస్‌ ఫౌండేశన్‌ చైర్‌ పర్సన్‌ సుధా మూర్తి కూడా ఈ కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు.

***



(Release ID: 1765360) Visitor Counter : 152