ప్రధాన మంత్రి కార్యాలయం
సూరత్‌లో సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్ నిర్మించిన హాస్టల్ తొలిదశకు భూమి పూజ నిర్వహించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ ప్రజల సేవాస్ఫూర్తిని కొనియాడిన ప్రధానమంత్రి
మనం సర్దార్ పటేల్ మాటలు అనుసరించాలి, మన దేశాన్ని ప్రేమించాలి, పరస్పర ప్రేమభావన , సహకారంతో మన గమ్యాన్ని చేరుకోవాలి.
"ప్రజా చైతన్యాన్ని మేల్కొల్పడంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తులను గుర్తుచేసుకోవడానికి అమృత్ కాల్ మనకు స్ఫూర్తినిస్తుంది. అలాంటి వారి గురించి నేటితరం తెలుసుకోవడం చాలా ముఖ్యం "
దేశం ప్రస్తుతం సంప్రదాయ నైపుణ్యాలను ఆధునిక అవకాశాలతో అనుసంధానిస్తున్నది
సబ్‌కా సాథ్, సబ్ కా వికాస్ శక్తి ఏమిటో నేను గుజరాత్ నుంచి నేర్చుకున్నాను.
ప్రపంచం మొత్తం ఇండియాపై ఎన్నో ఆశలతో ఉంది. కరోనా కష్ట కాలం నుంచి ఎంతో వేగంగా ఇండియా ఆర్థిక స్థితి, తిరిగి మామూలు దశకు చేరుకోగలిగింది.
Posted On:
15 OCT 2021 12:05PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , సూరత్‌లో సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్ నిర్మించిన హాస్టల్ భవనం తొలిదశ భూమి పూజ కార్యక్రమాన్ని ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు
ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, గుజరాత్ ప్రజల స్ఫూర్తిని ప్రశంసించారు.
సామాజిక అభివృద్ధి లక్ష్యాల విషయంలో గుజరాత్ ఎప్పుడూ నాయకత్వ స్థానంలో ఉంటుండడం తనకు గర్వకారణంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సర్దార్ పటేల్ ను గుర్తుచేసుకున్నారు. జాతీయ అభివృద్ధి విషయంలో కులం, వర్గం అనేవి అవరోధాలుగా మారడాన్ని అనుమతించరాదని సర్దార్‌పటేల్ నొక్కి చెప్పేవారని అంటూ ఆయన మాటలను ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు.
మనమందరం భరతమాత పుత్రులం, పుత్రికలం. మనమంతా మన దేశాన్ని ప్రేమించాలి, మన గమ్యాన్ని పరస్పర ప్రేమాభిమానాలతో , సహకారంతో సాధించాలి అని ప్రధానమంత్రి సర్దార్ పటేల్ మాటలను గుర్తు చేశారు.
ఇండియా ప్రస్తుతం 75వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలలో ఉంది. నూతన సంకల్పాలతోపాటు ఈ అమృత కాలం ప్రజలను చైతన్య పరచడంలో కీలకపాత్ర పోషించిన మహోన్నత వ్యక్తులను గుర్తుచేసుకోవడానికి ప్రేరణగా నిలుస్తుందని ప్రధానమంత్రి అన్నారు. అలాంటి మహనీయుల గురించి ప్రస్తుత తరం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆయన అన్నారు.
ప్రధానమం్తరి వల్లబ్ విద్యానగర్ గురించి మాట్లాడారు. విద్యను అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్టు చెప్పారు. దీని ద్వారా గ్రామ అభివృద్ధి పనులను వేగవంతం చేయవచ్చని కూడా ప్రధానమంత్రి చెప్పారు. ముఖ్యమంత్రిగా గుజరాత్‌కు సేవచేయడంలో తన అనుభవం గురించి ఆయన తెలియజేశారు. రాజకీయాలలో ఎలాంటి కుల పునాదిలేని తనను 2001లో రాష్ట్రానికి సేవచేసేందుకు ప్రజలు ఆశీర్వదించి అవకాశం ఇచ్చారని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాద బలం వల్ల తాను రాష్ట్రానికి సేవచేశానని, ఆ తర్వాత దేశానికి సేవచేస్తున్నానని, ఇలా ఎలాంటి విరామం లేకుండా ఇరవై సంవత్సరాలుగా ప్రజలకు సేవచేస్తున్నానని ప్రధానమంత్రి తెలిపారు.
సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ బలం ఎంతటిదో నేను గుజరాత్‌నుంచే దీనిని తెలుసుకున్నాను అని ఆయన అన్నారు. గుజరాత్‌లో వెనకటికి మంచి పాఠశాలలు ఉండేవి కావని, మంచి విద్య పొందడానికి టీచర్ల కొరత ఉండేదని ఆయన చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి తాను ఎలా ప్రజలతో మమేకమైనదీ ఆయన చెప్పుకోచ్చారు.
నూతన విద్యా విధానం, ప్రొఫెషనల్ కోర్సులను స్థానిక భాషలలో నేర్చుకునే అవకాశం ఇస్తున్నదని ఆయన తెలిపారు. ఇప్పుడు చదువు అనేది డిగ్రీలకు పరిమితం కావడంలేదని , చదువును నైపుణ్యాలతో అనుసంధానం చేస్తున్నారని అన్నారు. దేశం సంప్రదాయ నైపుణ్యాలను ఆధునిక అవకాశాలతో అనుసంధానం చేస్తున్నదని చెప్పారు.
కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఆర్ధిక వ్యవస్థ తిరిగి కోలుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, కరొనా కష్టకాలం నుంచి ఇండియా ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకున్న వేగాన్ని చూసి ప్రపంచం ఎంతో ఆశతో ఉందని ఆయన అన్నారు. ఇండియా ప్రపంచంలోనే అత్యంత వేగంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నదంటూ ప్రపంచ సంస్థ చేసిన ప్రస్తావనను ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు.
సాంకేతికతను , క్షేత్రస్థాయి వాస్తవాలతో అనుసంధానం చేస్తున్నందుకు గుజరాత్ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి ఈ సందర్బంగా అభినందించారు. వివిధ స్థాయిలలో పనిచేసిన వారి అనుభ వం గుజరాత్ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడనుంది అని ప్రధానమంత్రి అన్నారు.
***
DS/AK
(Release ID: 1764323)
Visitor Counter : 163
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam