ప్రధాన మంత్రి కార్యాలయం
డెన్మార్క్‌ప్రధానమంత్రిగౌరవనీయ మెట్టే ఫ్రెడెరిక్‌సెన్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త పత్రికా ప్రతినిధుల సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి సంక్షిప్త తెలుగు అనువాదం
Posted On:
09 OCT 2021 1:29PM by PIB Hyderabad
గౌరవనీయ డెన్మార్క్‌ప్రధానమంత్రి గారు,
డెన్మార్క్ ప్రతినిధులు,
మీడియాకు చెందిన అందరు మిత్రులకు....
నమస్కారం,,
కరోనా మహమ్మారికి ముందు ఈ హైదరాబాద్ హౌస్‌లో రెగ్యులర్‌గా వివిధ దేశాల అధిపతులు, వివిధ ప్రభుత్వాల అధిపతులకు స్వాగత కార్యక్రమాలు క్రమంతప్పకుండా ఉంటూ ఉండేవి. అయితే గత 18-20 నెలలుగా ఇది ఆగిపోయింది, డానిష్ ప్రధానమంత్రి పర్యటనతో మళ్లీ ఈరోజు కొత్త ఆరంభం జరిగింది.
ఎక్సలెన్సీ...
ఈ పర్యటన మీకు ఇండియాకు తొలి పర్యటన కావడం సంతోషకరమైన యాదృచ్ఛిక విషయం. డానిష్ ప్రతినిధి వర్గం మొత్తానికి , వారి తో వచ్చిన వ్యాపార వేత్తలు అందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను.
మిత్రులారా,
ఈరోజుటి మన సమావేశం మన తొలి ముఖాముఖి సమావేశం కావచ్చు. కానీ కరోనా సమయంలో ఉభయ దేశాల మధ్య సంబంధాలు, సహకారం స్థిరంగా ఉంటూ వచ్చాయి. ఏడాది క్రితం మనం నిర్వహించుకున్న వర్చువల్ శిఖరాగ్ర సమావేశంలో మనం ఇండియా, డెన్మార్క్ మధ్య వ్యూహాత్మక హరిత భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుందామని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం., మన పర్యవారణం పట్ల గౌరవానికి, ఉభయ దేశాల ముందు చూపుకు ఇది ఒక దర్ఫణం. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ సమష్టి కృషితో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఏ విధంగా హరిత అభివృద్ది దిశగా కృషి చేయవచ్చో ఈ భాగస్వామ్యం రుజువు చేస్తున్నది. ఇవాళ మనం ఈ ప్రధానమంత్రి గారి సమక్షంలో దీని పురోగతిని సమీక్షించడమే కాక సమీప భవిష్యత్తులో వాతావరణ మార్పులకు సంబంధించి పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించేందుకు చిత్తశుద్ధిని పునరుద్ఘాటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే , డెన్మార్క్ అంతర్జాతీయ సౌర కూటమిలో సభ్య దేశమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. మన మధ్యసహకారంలో కొత్త కోణాన్ని జోడించింది.
మిత్రులారా,
డానిష్ కంపెనీలకు ఇండియా కొత్తకాదు. డానిష్ కంపెనీలు ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్,లాజిస్టిక్స్, మౌలికసదుపాయాలు, సాఫ్ట్‌వేర్, తదితర రంగాలలో ఎంతోకాలంగా పనిచేస్తున్నాయి. ఈ కంపెనీలు మేక్ ఇన్ ఇండియాను విజయవంతం చేయడంలో చెప్పుకోదగిన కృషి చేయడమే కాక, ప్రపంచం కోసం మేక్ ఇన్ ఇండియాను కూడా విజయవంతం చేశాయి. అభివృద్ధి లో మనం ముందుకు వెళ్లవలసిన వేగం, ఇండియా ప్రగతికి గల మన దార్శనికత విషయంలో డానిష్ నైపుణ్యం, డానిష్ సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్రవహించనుంది. భారత ఆర్ధిక వ్యవస్థలో సంస్కరణలు, ప్రత్యేకించి తయారీ రంగంలో తీసుకున్న చర్యలు ఇలాంటి కంపెనీలకు అద్భుత అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇవాళ జరిగిన సమావేశంలో మనం ఇలాంటి కొన్ని అవకాశాలను చర్చించడం జరిగింది.
మిత్రులారా,
మనం మన మధ్య సహకార పరిధిని మరింత విస్తృతపరచుకోవాలని నిర్ణయించుకున్నాం, దీనికి కొత్త కోణాన్ని జోడిస్తున్నాము. మనం ఆరోగ్య రంగంలో కొత్త భాగస్వామ్యాన్ని ప్రారంభించాం. వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించేందుకు, భారతదేశంలో రైతుల రాబడి పెంచేందుకు వ్యవసాయ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానంలో పరస్పరం సహకకరించుకోవాలని కూడా నిర్ణయించుకున్నాం. ఈ కార్యక్రమం కింద, ఆహారభద్రత, కోల్డ్ చెయిన్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫర్టిలైజరర్స్, ఫిషరీస్, ఆక్వాకల్చర్ తదితర రంగాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాల విషయంలో పని చేయడం జరుగుతుంది. స్మార్ట్ వాటర్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ , వేస్ట్ టు బెస్ట్ సమర్ధ సరఫరా చెయిన్ ల వంటి వాటి విషయంలో కూడా మనం పరస్పరం సహకరించుకుందాం..
మిత్రులారా,
ఇవాళ, పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై మనం లోతైన, ఉపయోగకరమైన చర్చలు జరిపాం. వివిధ అంతర్జాతీయ వేదికలపై డెన్మార్క్ నుంచి అందుతున్న బలమైన మద్దతుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇరు దేశాలూ ప్రజాస్వామిక విలువలు, నిబంధనల ఆధారిత విశ్వాసాలతో మనం ఒకరితొమరొకరు కలసి పనిచేస్తూ ఇదే తరహాలో బలమైన సహకారం, సమన్వయం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను.
ఎక్సలెన్సీ,
తదుపరి ఇండియా - నార్డిక్ శిఖరాగ్ర సమ్మేళనానికి ఆతిథ్యం ఇచ్చేందుకు అవకాశం వచ్చినందుకు, అలాగే డెన్మార్క్ సందర్శించాల్సిందిగా ఆహ్వానించినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ అత్యంత ఉపయోగకరమైన చర్చలు జరిగినందుకు , ద్వైపాక్షిక సంబంధాలలో నూతన అధ్యాయానికి దారితీసే అన్ని నిర్ణయాలలో మీ సానుకూల ఆలోచనలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
(ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది సంక్షిప్త తెలుగు అనువాదం అని గమనించగలరు)
***
(Release ID: 1762667)
Visitor Counter : 155
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam