ప్రధాన మంత్రి కార్యాలయం

భారతీయ పారాలింపిక్ దళాని కి ప్రధాన మంత్రి తన నివాసం లో విందు ను ఇచ్చారు


మీరు దేశాని కి రాయబారులు గా ఉన్నారు, మీరు ప్రపంచ రంగస్థలం లో దేశం ప్రతిష్ట ను పెంచారు: ప్రధాన మంత్రి

యావత్తు దళం అజేయమైన భావన ను, ఇచ్ఛా శక్తి ని ప్రశంసించిన ప్రధాన మంత్రి


ప్రజల కు ప్రేరణ ను ఇవ్వడం కోసం, మార్పు ను తీసుకు రావడం లో సాయపడడం కోసం క్రీడాయేతర రంగాల ను కొన్నిటిని గుర్తించి ఆ రంగాల లో కృషి చేయవలసింది గా పారా-ఎథ్ లీట్ లకు ఉద్భోదించిన ప్రధాన మంత్రి

నిరంతరం మార్గదర్శకత్వాన్ని, ప్రేరణ ను, సమర్ధన ను అందిస్తున్నందుకు ప్రధాన మంత్రి కి ధన్యవాదాలు తెలిపిన క్రీడాకారులు

Posted On: 09 SEP 2021 1:59PM by PIB Hyderabad

టోక్యో 2020 పారాలింపిక్స్ లో పాల్గొన్న భారతీయ పారాలింపిక్స్ దళాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున తన నివాసం లో విందు ఇచ్చారు.  ఈ దళం లో పారా-ఎథ్ లీట్ లతో పాటు కోచ్ లు కూడా ఉన్నారు.

దళం సభ్యులందరి తో ప్రధాన మంత్రి మనసు విప్పి ఇష్టగోష్టి గా మాట్లాడారు.  క్రీడోత్సవం లో అంతవరకు ఉన్న రికార్డు లను బద్దలుకొడుతూ, చరిత్రాత్మకమైనటువంటి ప్రదర్శన ను ఇచ్చినందుకు గాను వారిని ఆయన అభినందించారు.  వారి కార్య సాధన దేశం లో ఆటలు ఆడే వారందరికీ చెప్పుకోదగిన రీతి లో నైతిక ఉత్తేజాన్ని అందించగలుగుతుందని, అంతేకాకుండా క్రీడాకారులు గా పేరు తెచ్చుకోవాలనుకునే వ్యక్తులు ముందడుగు వేసి ఆటల ను అనుసరించే విధం గా వారి కి ప్రోత్సాహాన్ని ఇవ్వగలుగుతుందని ఆయన అన్నారు.  క్రీడాకారుల ప్రదర్శన ఆట ల సంబంధి చైతన్యాని కి బాట ను పరచిందని కూడా ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి ప్రత్యేకించి దళం సభ్యుల లోని అజేయ భావన ను, ఇచ్ఛా శక్తి ని ప్రశంసించారు.  పారా-ఎథ్ లీట్ లు వారి జీవనం లో అధిగమించలేనంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను చక్కని ఆట తీరు ను కనబరచడం ప్రశంసాయోగ్యం గా ఉంది అంటూ ఆయన కొనియాడారు.  విజయ వేదిక వద్ద కు చేరుకోలేని వారి మనోనిబ్బరాన్ని పెంపొందింపచేస్తూ, నిజమైన క్రీడాకారులు ఓటమి వల్లో, గెలుపు వల్లో పడకుండా మునుముందుకే సాగిపోతుంటారని ప్రధాన మంత్రి అన్నారు.  వారు దేశాని కి రాయబారులు గా ఉన్నారు, మరి వారు వారి అసాధారణ ప్రదర్శన తో ప్రపంచ రంగస్థలం పై దేశం గౌరవాన్ని పెంచారు అని ఆయన అన్నారు.  

పారా-ఎథ్ లీట్ లు వారి ‘తపస్సు, పురుషార్థం, పరాక్రమం’ ల ద్వారా ప్రజలు వారి ని చూసే తీరు ను మార్చి వేశారు అని ప్రధాన మంత్రి అన్నారు.  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకొంటున్న ఈ కాలం లో, వారు క్రీడా జగతి కి వెలుపల కొన్ని రంగాల ను ఎంపిక చేసుకోవాలని, ప్రజల ను ఎలా ప్రేరేపించగలరో, మార్పు ను తీసుకు రావడం లో ఏ విధం గా వారు సాయపడగలరో అన్వేషించాలి అని ఆయన అన్నారు.

పారా-ఎథ్ లీట్ లకు ప్రధాన మంత్రి ఆహ్వానాన్ని ఇచ్చినందుకు ఆయన కు వారు ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన తో కలసి ఒకే బల్ల మీద కూర్చోవడం అనేది దానంతట అదే ఒక పెద్ద కార్యసిద్ధి అని క్రీడాకారులు పేర్కొన్నారు.  మరీ ముఖ్యం గా ఆయన అందిస్తూ వస్తున్నటువంటి మార్గదర్శకత్వం, ప్రేరణ మరియు సమర్ధన లకు గాను ఆయన కు వారు మరోమారు ధన్యవాదాలు వ్యక్తం చేశారు.  భారతదేశాని కి చెందిన క్రీడాకారులు వారి ప్రధాన మంత్రి నుంచి అభినందన పూర్వకమైన ఫోన్ కాల్స్ ను అందుకొన్నారన్న సంగతి తెలిసి ఇతర దేశాల క్రీడాకారులు ఆశ్చర్యపోయినట్లు వారు వెల్లడించారు.  పారా ఎథ్ లీట్ ల శిక్షణ కోసం ఉత్తమ  ఏర్పాటుల ను చేయడం లో ప్రభుత్వం శాయశక్తుల కృషి చేయడాన్ని వారు ప్రముఖం గా ప్రస్తావించారు.  

చాలా మంది ఆటగాళ్ళు వారు పతకాల ను గెలిచిన క్రీడా సామగ్రి పై వారి సంతకాల ను చేసి ప్రధాన మంత్రి కి బహుమతులు గా అందజేశారు.  పతకాల విజేతలు అందరూ సంతకాలు చేసిన ఒక వస్త్రాన్ని సైతం ప్రధాన  మంత్రి కి కానుక గా ఇచ్చారు.  ఆ క్రీడా సామగ్రి ని వేలం వేయడం జరుగుతుందని ఆయన వారికి చెప్పగా మంచిది అలాగే కానివ్వండది అంటూ క్రీడాకారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.  క్రీడ ల శాఖ, న్యాయ శాఖ ల కేంద్ర మంత్రులు కూడా ఈ సందర్భం లో పాలుపంచుకొన్నారు.



 

***



(Release ID: 1753543) Visitor Counter : 182