ప్రధాన మంత్రి కార్యాలయం
పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్ రజతపతక విజేత భవీనా పటేల్‌కు ప్రధానమంత్రి అభినందనలు
Posted On:
29 AUG 2021 9:06AM by PIB Hyderabad
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ క్రీడల మహిళా టేబుల్ టెన్నిస్‌లో రజత పతకం సాధించిన భారత క్రీడాకారిణి భవీనా పటేల్‌కు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో-
“విశిష్ట క్రీడాకారిణి భవీనా పటేల్ కొత్త చరిత్ర సృష్టించారు! ఈ మేరకు ఆమె చారిత్రక రజత పతకాన్ని స్వదేశానికి సమర్పించారు. ఈ ఘనత సాధించిన ఆమెకు హృదయపూర్వక అభినందనలు. ఆమె స్ఫూర్తిదాయక జీవన గమనం.. భవిష్యత్తులో యువతను మరింతగా క్రీడలవైపు ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు. #Paralympics”
***
DS/SH
(Release ID: 1750161)
Visitor Counter : 193
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam