యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
'వరల్డ్ 2021 అండర్ 20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్' పతకాలు సాధించిన భారతదేశ అథ్లెట్లతో సంభాషించిన క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్
అంతర్జాతీయ పోటీల్లో రాణించడానికి అథ్లెట్లకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు మరియు ఉత్తమ శిక్షణ అందిస్తుంది: శ్రీ అనురాగ్ ఠాకూర్
ఛాంపియన్‌షిప్‌లో రెండు రజతాలతో సహా మూడు పతకాలను గెల్చుకున్న భారత్
Posted On:
25 AUG 2021 1:44PM by PIB Hyderabad
ముఖ్యాంశాలు:
* ఇది మనం గర్వపడాల్సిన గొప్ప క్షణం, మాకు మీలో గొప్ప భవిష్యత్తు కనిపిస్తోంది : శ్రీ అనురాగ్ ఠాకూర్
* యువ అథ్లెట్లను తీర్చి దిద్ది రాణించేలా చేయడానికి శిక్షణ ఇవ్వడానికి మరింత మంది మాజీ అథ్లెట్లు ముందుకు రావాలి: క్రీడా మంత్రి
* పురుషుల 10000 మీటర్ల రేస్ వాక్‌లో శ్వాస సమస్యలను అధిగమించి రజత పతకాన్ని సాధించిన అమిత్ ఖత్రి.
* లాంగ్ జంప్‌లో రజతం సాధించిన షైలీ సింగ్
'వరల్డ్ 2021 అండర్ 20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్' లో పాల్గొన్న అథ్లెట్లు. పతకాలు సాధించిన భారతదేశ అథ్లెట్లను కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ రోజు న్యూఢిల్లీలో కలిసి వారితో మాట్లాడారు.కెన్యాలోని నైరోబిలోని మోయి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సెంటర్‌లో 2021 ఆగస్టు 18 నుంచి 22 వరకు ఈ పోటీలు జరిగాయి. ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్స్ అని పిలువబడే ఈ పోటీలలోదేశ క్రీడాకారులు రెండు రజతాలతో సహా మూడు పతకాలు సాధించారు. సమావేశంలో లాంగ్ జంప్ కోచ్ రాబర్ట్ బాబీ జార్జ్, అంజు బాబీ జార్జ్, కమల్ అలీ ఖాన్, సాయ్ డైరెక్టర్ జనరల్ కూడా పాల్గొన్నారు.
పోటీల్లో పతకాలను సాధించిన క్రీడాకారులను అభినందించిన శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ పోటీలలో క్రీడాకారులు తమ ప్రతిభతో దేశం గర్వపడేలా చేశారని అన్నారు. " ఇది మనం అందరం గర్వపడాల్సిన క్షణం " అని మంత్రి వ్యాఖ్యానించారు. ఆసియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్ గేమ్స్ వంటి అంతర్జాతీయ పోటీలలో భవిష్యత్తులో యువ అథ్లెట్లు రాణిస్తారన్న విశ్వాసాన్ని శ్రీ అనురాగ్ ఠాకూర్ వ్యక్తం చేశారు, ' మాకు మీలో భవిష్యత్తు కనిపిస్తోంది' అని మంత్రి అన్నారు.
కోవిడ్ -19 మహమ్మారి సృష్టించిన పరిస్థితుల మధ్య ప్రతిభ కనబరిచిన అథ్లెట్లు,వారిని ప్రోత్సహించిన క్రీడా సమాఖ్యలు, క్రీడాకారులను తీర్చిదిద్దిన కోచ్‌లు , పతకాలు సాధించిన క్రీడాకారులను మంత్రి ప్రశంసించారు. "కోవిడ్ -19 నేపథ్యంలో మీరు చూపిన ప్రతిభ ప్రశంసనీయం. క్లిష్ట సమయంలో మీరు ప్రతిభ కనబరిచారు " అని మంత్రి అన్నారు. విశాల దృక్పథంతో ఆలోచిస్తూ అథ్లెట్లు భవిష్యత్తు కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ తదుపరి స్థాయి పోటీకి సిద్ధం కావాలని ఆయన సూచించారు.
దేశంలో ప్రస్తుతం వివిధ క్రీడా విభాగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్న మంత్రి యువ క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచేలా చూడడానికి అథ్లెట్లకు అన్ని సౌకర్యాలు మరియు ఉత్తమ శిక్షణను ప్రభుత్వం అందిస్తుందని మంత్రి అన్నారు. టార్గెట్ ఒలింపిక్స్ తో పాటు గుర్తించిన క్రీడాకారులకు శిక్షణా కార్యక్రమాలను దీనిలో భాగంగా ఇప్పటికే అమలు చేస్తున్నామని అన్నారు. యువ క్రీడాకారులకు కోచింగ్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన మాజీ అథ్లెట్లనుఅభినందించిన మంత్రి మరింత మంది ముందుకు రావాలని కోరారు. నూతన ఆలోచలను ప్రభుత్వం స్వాగతిస్తుందని అన్న మంత్రి క్రీడా రంగ అభివృద్ధికి సూచనలను ఇవ్వాలని కోరారు. ప్రతి ఒక్కరూ కలసి పని చేసినప్పుడు క్రీడారంగం మరింత పుంజుకుంటుందని దేశంలో క్రీడా సంస్కృతి ఏర్పడుతుందని మంత్రి అన్నారు.
10000 మీటర్ల రేస్ వాక్‌లో రజతం సాధించిన అమిత్ ఖత్రి :
ప్రపంచ అథ్లెటిక్స్ అండర్ 20 ఛాంపియన్‌షిప్‌లో పురుషుల 10000 మీటర్ల రేస్ వాక్‌లో అమిత్ ఖత్రి శ్వాస సమస్యలను అధిగమించి రజత పతకాన్ని సాధించాడు. పోటీలోతొలుత నుంచి ముందు ఉన్న అమిత్ ఖత్రి 9000 మీటర్ల వరకు ఆధిక్యంలో నిలిచాడు. 42: 17.94 సమయంలో లక్ష్యాన్ని చేరిన అమిత్ ఖత్రి కెన్యాకు చెందిన హెరిస్టోన్ వాన్యోని (41: 10.84) తరువాత రెండవ స్థానంలో నిలిచాడు. నీరు తాగడానికి ఆయన ఎక్కువ సార్లు రిఫ్రెష్‌మెంట్ టేబుల్‌కి వెళ్ళాడు. ప్రత్యేకించి ముగింపుకు వెళ్లడానికి కేవలం ఒకటిన్నర ల్యాప్‌లో ఎక్కువ తీసుకోవడంతో బంగారు పతాకాన్ని కొద్దిలో కోల్పోవలసి వచ్చింది.
లాంగ్ జంప్‌లో శైలీ సింగ్ కు రజతం: మహిళల లాంగ్ జంప్ ఫైనల్‌లో షైలీ సింగ్ తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రతిభను కనబరచి 6.59 మీటర్లతో రజత పతకం సాధించింది. జాతీయ అండర్ 20 రికార్డ్ హోల్డర్ అయిన షైలీ సింగ్ ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ పొందిన ముగ్గురు మహిళల లాంగ్ జంపర్‌లో ఒకరు. ఫైనల్ లో 6.35 మీటర్లు లాంగ్ జంప్ తో ఫైనల్ లో ప్రవేశించిన శైలీ సింగ్ తన మూడో ప్రయత్నంలో 6.40 మీటర్లు సాధించింది.
మిశ్రమ 4x400 మీటర్ల రిలేస్‌లో బరత్ శ్రీధర్, ప్రియా మోహన్, సమ్మీ, కపిల్, అబ్దుల్ రజాక్ బృందానికి కాంస్య పతకం: నైరోబిలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ అండర్ 20 ఛాంపియన్‌షిప్ ప్రారంభ రోజున భారత 4x400 మీటర్ల మిశ్రమ రిలే జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. బరత్ శ్రీధర్, ప్రియా మోహన్, సమ్మీ మరియు కపిల్ 3: 20.60 సమయంలో గమ్యం చేరారు. నైజీరియా(3: 19.70 ) మరియు పోలాండ్ (3: 19.80) కంటే వెనుకబడ్డారు. క్వార్టర్ మైలు ఈవెంట్‌లో భారత ప్రతిభను చూసారు. నైరోబిలో జరిగిన 2018 అండర్ 20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో హిమా దాస్ మహిళల 400 మీటర్ల పరుగులో బంగారు పతకం సాధించింది.
ఇండియన్ క్వార్టెట్ - అబ్దుల్ రజాక్ రషీద్ లీడ్ లెగ్ ఉదయం హీట్స్‌లో 3: 23.36 సాధించారు. ప్రియా మరియు సమ్మీ తమ మహిళల 400 మీటర్ల హీట్లలో పాల్గొన్నారు. 46.42 సెకన్లలో దూరాన్ని పూర్తి చేసిన వీరు భరత , కపిల్ ప్రయత్నాలు వృధా కాకుండా చూసారు.
ఫెడరేషన్ కప్ జూనియర్ ఛాంపియన్‌షిప్ విజేత అయిన భరత లీడ్-ఆఫ్ లెగ్ కోసం 47.12 సమయాన్ని పూర్తి చేసి ప్రియాకు బాటన్ ను అందజేశారు. దక్షిణాఫ్రికా రెండవ స్థానంలో ఉంది. ప్రియా తన పూర్తి సామర్ధ్యంతో 52.77 సమయంలో గమ్యం చేరింది. ఇది సెకండ్ లెగ్ లో పాల్గొన్న వారిలో ఇది మూడవ ఉత్తమమైనది. పతక వేటలో భారతదేశాన్ని నిలబెట్టిన సమ్మీ 54.29 లో లెగ్‌ని పూర్తి చేసింది.
యాంకర్ లెగ్‌పై కపిల్ శ్రమించాడు. ఫైనల్‌లో అత్యంత వేగంగా పరిగెత్తినప్పటికీ పోలాండ్ మరియు నైజీరియాతో అంతరాన్ని అధిగమించలేకపోయాడు. తన ముగ్గురు సహచరుల సహకారంతో 46.42 సెకన్లలో తన ల్యాప్‌ని ముగించాడు.
***
(Release ID: 1748915)
Visitor Counter : 235
Read this release in:
English
,
Tamil
,
Odia
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam