సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ప్రజల భాగస్వామ్యం స్ఫూర్తిగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు

దూరదర్శన్, ఆలిండియా రేడియో నెట్వర్క్లో రోజంతా ప్రత్యేక స్వాతంత్ర్య దినోత్సవ కవరేజీ
ఆలిండియా రేడియో యొక్క ‘ఆజాదీ కా సఫర్ ఆకాశవాణి కే సాథ్’ ఆగస్టు 16వ తేదీ నుంచి ప్రసారమవుతుంది.
దూరదర్శన్ న్యూస్ చానల్లో ప్రత్యేక కార్యక్రమాల ప్రసారాలు
ఉత్తమ భారతీయ దేశభక్తి చిత్రాలను ప్రదర్శించే మూడురోజుల చిత్రోత్సవాలు

Posted On: 13 AUG 2021 3:00PM by PIB Hyderabad

 

భారత 75వ  స్వాతంత్ర్య వేడుకల జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడానికి, ప్రజలను పెద్దసంఖ్యలో భాగస్వాములను చేయడానికి ప్రజల భాగస్వామ్యంతో  కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ  ప్రజాఉద్యమస్థాయిలో  అనేక వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని, నవశకంవైపు భారతదేశాన్ని నడిపించడంలో ప్రజలను భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ఈ మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రసార మాధ్యమాలు కూడా విభిన్న రీతుల్లో దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

మీడియా సంస్థలు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం.. స్వాతంత్ర్య పోరాటంలో సమరయోధుల పాత్రను తిరిగి గుర్తుచేయడమే. ఇందులోభాగంగా ఆలిండియా రేడియో ‘ఆజాదీ కా సఫర్ ఆకాశవాణి కే సాథ్’ పేరుతో ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇది జాతీయ, ప్రాంతీయ చానళ్లలో ఆగస్టు 16, 2021 నుంచి ప్రసారం కానుంది. ప్రతిరోజు ఐదు నిమిషాలపాటు ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఆనాటి చారిత్రక, రాజకీయ ఘటనలపై ప్రతిరోజు ఉదయం 8.20 గంటలకు హిందీలో, ఉదయం 8.50గంటలకు ఇంగ్లిష్లో ప్రసారం చేస్తారు. ప్రజస భాగస్వామ్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆలిండియా రేడియో జాతీయ, ప్రాంతీయ అమృత్ మహోత్సవ్ థీమ్ క్విజ్ను కూడా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ఆగస్టు 16, 2021నుంచి ఉదయం 8.00గంటల నుంచి ఉదయం 8.30 గంటల వరకు హిందీలో,  ఉదయం 8.30గంటల నుంచి 9.00గంటల వరకు ఇంగ్లిష్లో ప్రసారం అవుతుంది.

16 ఆగష్టు, 2021 నుంచి దూరదర్శన్  నెట్‌వర్క్ కూడా  ప్రతిరోజూ  ఐదు నిమిషాలపాటు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది. ఇందులోభాగంగా..  స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఆ రోజు జరిగిన చారిత్రక, రాజకీయ సంఘటనల గురించి తెలియజేస్తుంది. ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్ న్యూస్ చానల్లో ఉదయం 8.55గంటలకు, దూరదర్శన్ ఇండియా చానల్లో ఉదయం8.30 గంటలకు ప్రతిరోజూ ప్రసారమవుతుంది. అంతేకాకుండా భారతీయ దేశభక్తి, త్యాగాలు ఇతివృత్తంగా కలిగిన  చిత్రాల సమాహారాన్ని దూరదర్శన్ సిద్ధం చేసింది. ఆగస్టు 15వ తేదీన ‘హిందుస్తాన్ కీ కసమ్’ మరియు ‘తిరంగా’ వంటి సినిమాలను ప్రసారం చేస్తుంది. అంతేకాకుండా స్టార్టప్స్, డిఫెన్స్, స్పేస్, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని చట్టాలపై ప్రత్యేక కార్యక్రమాల సీరిస్ కూడా ప్రసారమవుతుంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రోజంతా ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇందులోభాగంగా ఎర్రకోట వద్ద జరిగే ప్రత్యేక కార్యక్రమాలు, పతాకావిష్కరణ వంటి కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం కూడా ఉంటుంది.

నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఈ వేడుకల్లో భాగస్వామి అవుతోంది. తన ఓటీటీ ప్లాట్ఫామ్www.cinemasofindia.comపై ఆగస్టు 15 2021 నుంచి ఆగస్టు 17, 2021 వరకు గాంధీ, మేకింగ్ ఆఫ్ మహాత్మా, ఘారే బైరే వంటి చిత్రాలను ప్రదర్శిస్తుంది. అదేసమయంలో ఫిల్మ్ డివిజన్ కూడా మూడురోజులపాటు చిత్రోత్సవాలను జరుపుకుంటుంది. ఇందులోభాగంగా స్వాతంత్ర్య సమరయోధులు, భారత స్వాతంత్ర్య పోరాట చిత్రాలను ప్రదర్శిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల సమన్వయంతో ఈ చిత్రాలను ప్రేక్షకుల వద్దకు చేరుస్తారు.

ఈ ఉత్సవాల్లోభాగంగా ప్రజలకు చేరువయ్యేందుకు  కేంద్ర  సమాచార ప్రసారమంత్రిత్వ సామాజిక మాద్యమాలను వేదికగా ఉపయోగించుకుంటోంది. ఇందుకోసం భారత స్వాతంత్ర్య సంగ్రామం వంటి విభిన్న అంశాలపై సమగ్ర సమాచారంతో కూడిన ప్రత్యేక ఆడియో విజువల్ కంటెంట్సిద్ధం చేస్తోంది. ఇందుకోసం యువత, పిల్లల నుంచే కాకుండా ఇంటర్నెట్వినియోగదారుల నుంచి వేర్వేరు ఇతివృత్తాలపై ఆయా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి వీడియోలను ఆహ్వానిస్తోంది.

 

***(Release ID: 1745528) Visitor Counter : 294