ప్రధాన మంత్రి కార్యాలయం

టోక్యో ఒలింపిక్స్ 2020 లో జావెలిన్ త్రో లో బంగారు పతకాన్ని గెలిచినందుకు నీరజ్ చోప్ డా ను అభినందించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 07 AUG 2021 6:00PM by PIB Hyderabad

టోక్యో ఒలింపిక్స్ 2020 లో జావెలిన్ త్రో లో బంగారు పతకాన్ని గెలిచినందుకు నీరజ్ చోప్ డా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు. ఆయన ప్రశంసాయోగ్యమైన ఉద్వేగం తో ఆడారు, అంతేకాక సాటిలేనటువంటి ధైర్యాన్ని కనబరచారు అని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘ టోక్యో లో చరిత్ర ను లిఖించడమైంది. ఈ రోజు న @Neeraj_chopra1 సాధించిన దానిని ఎప్పటికీ గుర్తు పెట్టుకోవడం జరుగుతుంది. యువకుడైన నీరజ్ చాలా చక్కగా రాణించాడు. ఆయన ప్రశంసాయోగ్యమైనటువంటి ఉద్వేగం తో ఆడి, సాటిలేనటువంటి సాహసాన్ని ప్రదర్శించారు. బంగారాన్ని గెలిచినందుకు గాను ఆయన కు ఇవే అభినందన లు. #Tokyo2020 ’’ అని పేర్కొన్నారు.

***

DS/SH


(रिलीज़ आईडी: 1743681) आगंतुक पटल : 224
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam