ప్రధాన మంత్రి కార్యాలయం

స్థానిక చేనేత ఉత్పత్తుల కుసమర్థన ను అందించాలంటూ జాతీయ చేనేత దినం నాడు పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి


చేనేత లు భారతదేశం వైవిధ్యాన్ని, అసంఖ్యాకం గా ఉన్నటువంటి చేనేత కార్మికులు, చేతి వృత్తుల వారి నేర్పరితనాన్ని ప్రకటిస్తున్నాయి: ప్రధాన మంత్రి

Posted On: 07 AUG 2021 1:36PM by PIB Hyderabad

చేనేత లు భారతదేశం వివిధత్వాన్ని, అసంఖ్యాకంగా ఉన్నటువంటి చేనేత కార్మికుల, చేతి వృత్తుల వారి నేర్పు ను స్పష్టం చేస్తున్నాయి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. స్థానికంగా తయారు అవుతున్న చేనేత ఉత్పాదనల కు సమర్థన ను అందించవలసిందంటూ ఆయన పిలుపునిచ్చారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘చేనేత లు భారతదేశం వివిధత్వాన్ని, అసంఖ్యాకంగా ఉన్నటువంటి చేనేత కార్మికుల, చేతి వృత్తుల వారి నేర్పు ను స్పష్టం చేస్తూ ఉంటాయి. జాతీయ చేనేత దినం #MyHandloomMyPride స్ఫూర్తి ని ఇనుమడింపచేయడం ద్వారా మన చేనేత కార్మికుల కు సమర్థన ను మరో మారు నొక్కిచెప్పేటటువంటి ఒక సందర్భంగా ఉంటోంది. రండి, స్థానిక చేనేత ఉత్పత్తుల కు మన సమర్ధన ను తెలియజేద్దాం.’’ అని పేర్కొన్నారు.

 

 

ఒలింపిక్స్ లో పతకం సాధించిన సాయిఖోమ్ మీరాబాయి చాను ఒక ట్వీట్ లో పేర్కొన్న మాటల ను ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ తన ట్వీట్ లో :

‘‘గత కొన్నేళ్లు గా చేనేతలంటే ఒక కొత్త ఆసక్తి ఏర్పడటాన్ని గమనిస్తున్నాం. #MyHandloomMyPride స్ఫూర్తి ని @mirabai_chanu సమర్థించడం చూసి సంతోషం వేసింది. ఆత్మనిర్భర్ భారత్ ను నిర్మించడానికి చేనేతల రంగం తన తోడ్పాటు ను అందిస్తూనే ఉంటుందని నాకు పూర్తి నమ్మకం ఉంది.’’ అని పేర్కొన్నారు.

 

***

DS


(Release ID: 1743662)