ప్రధాన మంత్రి కార్యాలయం

టీకామందును వేయించుకొన్న వారి సంఖ్య 50 కోట్ల సంఖ్య ను మించడం తో కోవిడ్-19 కి వ్యతిరేకం గా భారతదేశం చేస్తున్న యుద్ధం లోప్రబలమైనటువంటి ఉత్తేజం అందింది: ప్రధాన మంత్రి 

Posted On: 06 AUG 2021 9:07PM by PIB Hyderabad

టీకా మందు ను వేయించుకొన్న వారి సంఖ్య 50 కోట్ల సంఖ్య ను మించిపోవడం తో, ఈ సంఖ్యల ను ఇలాగే పెంచుకొంటూ పోవాలని, మరి ‘అందరికీ టీకామందు- అందరికీ ఉచితంగా ఇప్పించే ఉద్యమం’ లో భాగం గా మన పౌరులు అందరి కి టీకామందు ను ఇప్పించాలని భారతదేశం ఆశ పడుతున్నదని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

‘‘కోవిడ్-19 కి వ్యతిరేకం గా భారతదేశం చేస్తున్న యుద్ధం లో ఒక ప్రబలమైనటువంటి ఉత్తేజం లభించింది. టీకామందు ను వేయించుకొన్న వ్యక్తుల సంఖ్య 50 కోట్ల సంఖ్య ను మించిపోయింది. ఈ సంఖ్యల ను ఇంకా పెంచుకొంటూ పోతూ, #SabkoVaccineMuftVaccine ఉద్యమం లో భాగం గా మన పౌరులందరికీ టీకామందు ను ఇప్పించేందుకు పూచీ పడాలి అన్నదే మన ఆశ గా ఉంది.’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***



(Release ID: 1743660) Visitor Counter : 128