యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్న భారత పురుషుల హాకీ టీమ్
41 సంవత్సరాల విరామం తర్వాత పతకం గెలుచుకున్న పురుషుల హాకీ టీమ్
Posted On:
05 AUG 2021 2:05PM by PIB Hyderabad
ముఖ్యాంశాలు:
- ఇండియా 5-1 పాయింట్ల తేడాతో జర్మనీని ఓడించి కాంస్య పతకం గెలుచుకుంది.
-రాష్ట్రపతి శ్రీరామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలు పురుషుల హాకీ టీమ్‌కు అభినందనలు తెలిపారు.
భారత పురుషుల హాకీ టీమ్‌కు అభినందనలు తెలపుతూ కేంద్ర క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, భారతదేశం మిమ్మలను చూసి గర్విస్తోంది, చరిత్రాత్మక విజయంలో భాగంగా భారత పురుషుల హాకీ టీమ్ ఈరోజు టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకం గెలుచుకుంది అని పేర్కొన్నారు. ఇది గత 41 సంవత్సరాలలో మన దేశానికి చెందిన పురుషుల హాకీ టీమ్ గెలుచుకున్న తొలి పతకం. జర్మనీని 54 తేడాతో ఓడించి వీరు ఈ విజయాన్ని సొంతం చేసుకున్నారన్నారు. రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ , ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ,క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్, దేశం నలుమూలల నుంచి పలువురు ప్రముఖులు భారత పురుషుల హాకీ జట్టును , అది సాధించిన విజయానికి అభినందనలు తెలియజేశారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పురుషుల హాకీ టీమ్ కెప్టెన్ మన్‌ప్రీత్‌సింగ్, హెడ్ కోచ్ గ్రహమ్ రీడ్, అసిస్టెంట్ కోచ్ పియూష్ దూబెతో మాట్లాడి వారికి అభినందనలు తెలిపారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేస్తూ , “ మన పురుషుల హాకీ బృందం 41 సంవత్సరాల తర్వాత హాకీలో ఒలింపిక్ పతకాన్ని సాధించినందుకు అభినందనలు. ఈ బృందం తన అద్భుత నైపుణ్యాన్ని పట్టుదలను ప్రదర్శించింది. ఈ చరిత్రాత్మక విజయం హాకీలో నూతన శకానికి ప్రారంభం గా నిలవడంతోపాటు, ఈ క్రీడలో రాణించేందుకు యువతకు ప్రేరణగా నిలుస్తుంది.” అని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , భారత పురుషుల హాకీ బృందం కాంస్యపతకం గెలుచుకున్నందుకు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేస్తూ, ఇది చరిత్రాత్మకం, ఈ రోజు ప్రతి భారతీయుడి మదిలో నిలిచిపోతుంది. మన పురుషుల హాకీ బృందం కాంస్యపతకం గెలుచుకున్నందుకు అభినందనలు. దీనితో మనం మొత్తం దేశ ప్రజల దృష్టిని, ప్రత్యేకించి యువతను ఆకర్షించగలిగాం .మన హాకీ టీంను చూసి బారత్ గర్విస్తోందిష అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
కేంద్ర క్రీడలశాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ , పురుషుల హాకీ టీమ్‌ను అభినందిస్తూ ట్విట్టర్ ద్వారా ఒక సందేశం ఇచ్చారు. “భారతదేశానికి బిలియన్ ఛీర్స్,హాకీ జట్టు సభ్యులారా, మీరు విజయం సాధించి చూపారు.మేం మౌనంగా ఉండలేం. మన పురుషుల హాకీ టీమ్ పై చేయి సాధించి ఒలింపిక్ చరిత్ర పుస్తకాలలో తమ విజయాన్ని లిఖించింది.మరోసారి,మిమ్మలను చూసి మేమెంతో గర్వపడుతున్నాం.” అని పేర్కొన్నారు.
టిఒపిఎస్ పథకం కింద మద్దతు:
వివిధ అంతర్జాతీయ పోటీలు, విదేశీ శిక్షణలకు వీసా సహాయం
టీమ్ ఫిజియో థెరపిస్ట్‌కు టిఒపిఎస్ కింద నిధులు
2018 ఏసియన్ గేమ్స్ సందర్భంగా నెలకు 50,000 రూపాయల ఔట్ ఆఫ్ పాకెట్ అలవెన్సు రెండు నెలలు మంజూరు
Support from TOPS:
.2021 మార్చి నుంచి 2021 ఆగస్టు వరకు ఔట్ ఆఫ్ పాకెట్ అలవెన్సు
విదేశీప్రయాణాలు, నేషనల్ కోచింగ్ క్యాంపులు, సపోర్టు స్టాఫ్, పరికరాలను ఎసిటిసి కింద సమకూర్చడం జరిగింది.
నిధులు (2016- ప్రస్తుతం)
టిఒపిఎస్ టీమ్ : రూ 16,80,000
టిఒపిఎస్ వ్యక్తిగత రూ 3,00,000
ఎసిటిసి టీమ్ రూ 50,00,00,000
మొత్తం రూ 50,19,80,000
***
(Release ID: 1742921)
Visitor Counter : 197