ప్రధాన మంత్రి కార్యాలయం

'విక్రాంత్' ద్వారా తొలి సముద్ర తీర రక్షణ వ్యవస్థను సాధించినందుకు, భారత నౌకాదళం మరియు కొచ్చిన్ షిప్‌యార్డ్ లను అభినందించిన - ప్రధానమంత్రి

Posted On: 04 AUG 2021 9:01PM by PIB Hyderabad

స్వదేశీ విమాన వాహక నౌక 'విక్రాంత్' ద్వారా తొలి సముద్ర తీర రక్షణ వ్యవస్థను సాధించినందుకు భారత నావికాదళం మరియు కొచ్చిన్ షిప్‌యార్డ్‌ లను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.   "భారత్ లో తయారీ' కి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ అని కూడా ప్రధానమంత్రి అభివర్ణించారు. 

ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ,  "భారత నావికాదళానికి చెందిన డిజైన్ బృందం రూపకల్పన చేయగా, కొచ్చిన్ షిప్ యార్డ్ నిర్మించిన, స్వదేశీ విమాన వాహక నౌక 'విక్రాంత్', ఈ రోజు మొదటి సారిగా సముద్ర జలాల్లోకి ప్రవేశించింది.  "మేక్-ఇన్-ఇండియా" కి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ చారిత్రాత్మక సంఘటన సందర్భంగా భారత నావికాదళానికీ,  కొచ్చిన్ షిప్ యార్డ్ కూ, అభినందనలు." అని, పేర్కొన్నారు. 

 

 

***

DS/SH


(Release ID: 1742544) Visitor Counter : 237