ప్రధాన మంత్రి కార్యాలయం

అసహాయ పశువుల కు అండ గా ఉన్న రిటైరైన సైనికాధికారిణి ని ప్రశంసించిన ప్రధాన మంత్రి


జంతువుల ఆహారానికి, చికిత్స కు గాను మేజర్ ప్రమీల సింహ్ తన పొదుపు మొత్తం నుంచి ఏర్పాటు చేశారు

మీ చొరవ సమాజానికి ప్రేరణ ను అందించేది గా ఉందంటూ లేఖ రాసిన ప్రధాన మంత్రి

మునుపు ఎరుగనటువంటి ఈ సంకటం పశువులకు సైతం కఠినమైందే, మరి మనం వాటి అవసరాలు, వాటి యాతన ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది:  ప్ర‌ధాన మంత్రి

Posted On: 18 JUL 2021 12:44PM by PIB Hyderabad

భారతీయ సైన్యం లో మేజర్ హోదా లో పదవీవిరమణ పొందిన రాజస్థాన్ లోని కోట నివాసి ప్రమీల సింహ్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక లేఖ ను రాశారు.  లాక్ డౌన్ అమలైన కాలం లో, మేజర్ ప్రమీల సింహ్ (రిటైర్ డ్) తన తండ్రి శ్రీ శ్యాంవీర్ సింహ్ తో కలసి అసహాయ పశువుల యాతన ను గ్రహించి వాటికి తోడ్పడటానికి ముందుకు వచ్చి వాటి సంరక్షణ బాధ్యత ను స్వీకరించారు.  దారి తప్పిపోయి వీధుల లో తిరుగుతున్న పశువుల కు మేజర్ ప్రమీల, ఆమె తండ్రి గారు వారి సొంత డిపాజిట్ ల తో ఆహారాన్ని, చికిత్స ను అందించే ఏర్పాటు చేశారు.  మేజర్ ప్రమీల ప్రయాస లు సమాజానికి ఒక ప్రేరణ గా నిలచాయి అంటూ ఆమె ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ప్రధాన మంత్రి ఒక లేఖ లో ఇలా రాశారు.. ‘గడచిన సుమారు ఏడాదిన్నర కాలం లో, మనం ఇదివరకు ఎరుగనటువంటి సందర్భాల ను
నైతిక ధైర్యం తో ఎదుర్కొన్నాం.  ఇది ఎటువంటి చారిత్రక కాలం అంటే ఈ కాలాన్ని ప్రజలు వారి శేష జీవనం లో మరచిపోలేరు.  ఇది మానవులు ఒక్కరికే కష్ట కాలం కాదు కానీ మానవుల తో సన్నిహితం గా జీవిస్తున్నటువంటి అనేక ప్రాణుల కు కూడా కష్ట కాలమే.  ఆ తరహా స్థితి లో, దిక్కు లేనటువంటి జంతువుల అవసరాలు, వాటి యాతన ల పట్ల, వాటి సంక్షేమం కోసం  మీరు పడ్డ తపన, వ్యక్తిగతం గా మీరు మీ పూర్తి స్థాయి లో చేస్తున్న కృషి ప్రశంసనీయం.’
 
ఈ కఠిన కాలం లో, మానవ జాతి ని చూసుకొని గర్వపడేటటువంటి అనేకమైన ఉదాహరణలు మన ముందుకు వచ్చాయి అని ప్రధాన మంత్రి తన ఉత్తరం లో రాశారు.  మేజర్ ప్రమీల, ఆమె నాన్న గారు వారి కార్యక్రమాల తో సమాజం లో జాగృతి ని వ్యాపింపచేస్తూనే ఉంటారు అనేటటువంటి ఆశాభావాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

అంతక్రితం, మేజర్ ప్రమీల సింహ్ ప్రధాన మంత్రి కి ఒక లేఖ ను రాశారు. ఆ ఉత్తరం లో పశువు ల సంరక్షణ పట్ల శ్రద్ధ తీసుకొనే పని ని లాక్ డౌన్ సందర్భం లో తాను మొదలుపెట్టి ఆ పని ని ఇప్పటికీ ఇంకా కొనసాగిస్తున్నట్లు ఆమె తెలియజేశారు.  పశువు ల నిస్సహాయత, వాటి అవస్థల ను గురించి ఆమె తన ఉత్తరం లో వివరిస్తూ, వాటి కి తోడ్పడటానికి మరింత మంది ప్రజలు ముందుకు రావాలి అంటూ విజ్ఞప్తి చేశారు.

 

 

***



(Release ID: 1736645) Visitor Counter : 208