ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్ లో అనేక ప్రాజెక్టుల ను ప్రారంభించి, దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి
కాంక్రీటు నిర్మాణం ఒక్కటే కాకుండా తనదైన అంతస్తు ను కలిగివున్న మౌలిక సదుపాయాలే ప్రస్తుతం మన లక్ష్యం: ప్రధాన మంత్రి
21వ శతాబ్ది కి చెందిన భారతదేశం అవసరాల ను 20వ శతాబ్దం తాలూకు పద్ధతుల తో తీర్చడం వీలుపడదు: ప్రధాన మంత్రి
బాలల సృజనాత్మకత ను ప్రోత్సహించేటటువంటి వినోద కార్యకలాపాలు సైన్స్ సిటీ లో ఉన్నాయి: ప్రధాన మంత్రి
మేం రైల్వేల ను సేవ కోసమే కాకుండా ఒక ఆస్తి గా కూడా అభివృద్ధి చేశాం: ప్రధాన మంత్రి
రెండో అంచె, మూడో అంచె నగరాల లోని రైల్వే స్టేశన్ లలో సైతం అధునాతన సదుపాయాల ను సమకూర్చడమైంది: ప్రధాన మంత్రి
Posted On:
16 JUL 2021 5:45PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లో రైల్వే లకు చెందిన కీలకమైన అనేక పథకాల ను వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించి, దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ కార్యక్రమం లో భాగం గా ఆయన గుజరాత్ సైన్స్ సిటీ లో ఆక్వాటిక్స్- రోబోటిక్స్ గ్యాలరీ ని, నేచర్ పార్కు ను కూడా ప్రారంభించారు. గాంధీనగర్ రాజధాని- వారాణసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, గాంధీ నగర్ రాజధాని, వరేఠా ల మధ్య ఎమ్ఇఎమ్‌యు సర్వీస్ రైలు అనే రెండు కొత్త రైళ్ళ కు ఆయన జెండా ను చూపెట్టి, వాటిని ప్రారంభించారు.
సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఇవాళ దేశం లక్ష్యం కేవలం ఓ కాంక్రీటు నిర్మాణాన్ని సృష్టించడం కాదు, తనదైన యోగ్యత ను కలిగిన ఒక మౌలిక సదుపాయాన్ని అందించడం కూడాను అని పేర్కొన్నారు. బాలలు నేర్చుకోవడం, సృాత్మకం గా పెరగడం తో పాటు వారు స్వాభావికం గా ఎదగాలి అంటే, వారికి వినోదం, తగినంత అవకాశం కూడా లభించాలి అని ఆయన చెప్పారు. సైన్స్ సిటీ ఎలాంటి ప్రాజెక్టు అంటే అందులో వినోదం, సృ రెండూ కూడా కలసి ఉంటాయి అని ఆయన అన్నారు. పిల్లల్లో సృజనాత్మకత ను ప్రోత్సహించేటటువంటి కార్యకలాపాలు అక్కడ ఉన్నాయన్నారు.
సైన్స్ సిటీ లో నిర్మించిన ఆక్వాటిక్స్ గ్యాలరీ మరింత ఉల్లాసాన్ని అందించనుందని ప్రధాన మంత్రి తెలిపారు. ఇది మన దేశం లో మాత్రమే కాకుండా ఆసియా లోనూ అగ్రగామి జలజీవశాలల్లో ఒకటి అని ఆయన వివరించారు. ప్రపంచం లో అన్ని మూలల నుంచి సేకరించిన సముద్ర జీవ జాతులన్నిటినీ ఒకే చోటు లో చూడటం అనేది ఒక అద్భుతమైన అనుభవమని ఆయన అన్నారు.
రోబోటిక్స్ గ్యాలరీ లో మర మనుషుల తో సంచరించడం అనేది కేవలం ఒక ఆకర్షణ కేంద్రం అనే కాకుండా రోబోటిక్స్ రంగం లో కృషి చేయడానికి మన యువతీ యువకుల కు ప్రేరణ ను కూడా అందిస్తుందని, వారి మేధస్సు లో తెలుసుకోవాలి అనేటటువంటి ఆరాటాన్ని నాటుతుందని ప్రధాన మంత్రి అన్నారు.
21వ శతాబ్ది లో భారతదేశం అవసరాల ను 20వ శతాబ్దాని కి చెందిన పద్ధతుల తో తీర్చడం సాధ్యం కాదు అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఈ కారణం గా రైల్వేల లో ఒక సరికొత్త సంస్కరణ అవసరపడిందని ఆయన అన్నారు. రైల్వేల ను అభివృద్ధి చేయడానికి సాగుతున్న ప్రయత్నాల ఫలితాలు ఇవాళ ఒక సేవ గానే కాకుండా ఒక ఆస్తి గా కూడా మన ముందు నిలచాయి అని ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తం గా ఉన్నటువంటి ప్రధానమైన రైల్వే స్టేశన్ లను ఆధునీకరించడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. రెండో అంచె, మూడో అంచె నగరాల లోని రైల్వే స్టేశన్ లను సైతం వై-ఫై సౌకర్యాల తో తీర్చిదిద్దడమైందన్నారు. ప్రజల కు సురక్ష ను పెంచేందుకు బ్రాడ్ గేజ్ మార్గాల లో మనిషి కాపలా లేని రైల్వే క్రాసింగ్ లను పూర్తిగా తొలగించడం జరిగిందన్నారు.
భారతదేశం వంటి ఒక విశాలమైన దేశం లో రైల్వేల పాత్ర కీలకమని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. రైల్వే లు అభివృద్ధి తాలూకు కొత్త పార్శ్వాల తో పాటు, సదుపాయాల తాలూకు కొత్త కోణాల ను కూడా తమ వెంటబెట్టుకు తీసుకు వస్తాయని ఆయన అన్నారు. గడచిన కొన్ని సంవత్సరాల కృషి వల్ల నేడు రైళ్ళు మొట్టమొదటిసారి గా ఈశాన్య రాష్ట్రాల రాజధానుల ను చేరుకొంటున్నాయని చెప్పారు. ‘‘ఈ విస్తరణ లో ఇవాళ వడ్ నగర్ కూడా ఒక భాగం గా మారింది. వడ్ నగర్ స్టేశన్ తో నాకు అనేక జ్ఞాపకాలు పెనవేసుకొని ఉన్నాయి. కొత్త స్టేశన్ నిజం గానే ఆకర్షణీయం గా కనుపిస్తోంది. ఈ కొత్త బ్రాడ్ గేజి మార్గాన్ని నిర్మించినందువల్ల వడ్ నగర్-మోఢేరా- పాటన్ హెరిటేజ్ సర్క్యూట్ ఇప్పుడు మెరుగైన రైలు సేవ తో జతపడింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
ఏక కాలం లో రెండు మార్గాల మీద నడవడం వల్ల మాత్రమే ‘న్యూ ఇండియా’ తాలూకు అభివృద్ధి బండి ముందుకు సాగిపోతుంది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఈ రెండు మార్గాల లో ఒక మార్గం ఆధునికత కు చెందింది, రెండో మార్గం పేదలు, రైతులు, మధ్యతరగతి సంక్షేమానికి చెందింది అని ఆయన చెప్పారు.
***
(Release ID: 1736313)
Visitor Counter : 251
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam