ప్రధాన మంత్రి కార్యాలయం
ముఖ్య విజ్ఞానశాస్త్ర సంస్థల తో సమావేశాన్ని గురించి ట్వీట్ లలో వివరించిన ప్రధాన మంత్రి
Posted On:
08 JUL 2021 3:46PM by PIB Hyderabad
కేంద్రం నిధుల తో నడుస్తున్న సాంకేతిక సంస్థల కు చెందిన 100 మంది కి పైగా డైరెక్టర్ ల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను నిర్వహించిన సమావేశం ముగిశాక, దేశం లోని ప్రముఖ సైన్స్, టెక్నాలజీ సంస్థలు ఆ సమావేశం లో ఇచ్చిన నివేదికల వివరాలను ప్రజలకు తెలియజేశారు. ప్రధాన మంత్రి తన ట్వీట్ లలో ఐఐఎస్‌సి బెంగళూరు, ఐఐటి ముంబయి, ఐఐటి చెన్నై, ఐఐటి కాన్ పుర్ లను గురించి పేర్కొన్నారు.
అనేక ట్వీట్ లలో ప్రధాన మంత్రి ఇలా పేర్కొన్నారు:
ప్రముఖ ఐఐటి లకు చెందిన డైరెక్టర్ లతో, @iiscbangalore డైరెక్టర్ లతో ఒక చక్కని సంభాషణ చోటు చేసుకొంది. ఈ సంభాషణ క్రమం లో - పరిశోధన, అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, యువత లో విజ్ఞానశాస్త్రానికి ఆదరణ మరింత పెరిగేటట్లు చూడటం వంటి అంశాల లో భారతదేశాన్ని ఒక కేంద్రం గా తీర్చిదిద్దడం సహా అనేక అంశాల పైన - మేం మా అభిప్రాయాల ను వ్యక్తం చేసుకొన్నాం.
రోబోటిక్స్, గణితశాస్త్ర అధ్యాపకులకు/విజ్ఞానశాస్త్ర గురువుల కు శిక్షణ ను ఇవ్వడం వంటి విద్య రంగ సంబంధి కృషి, కోవిడ్-19 తాలూకు పని ల వంటి అంశాల లోను, పరిశోధన, అభివృద్ధి (ఆర్ & డి) సంబంధిత కార్యక్రమాల పై @iiscbangalore వారు వారి కీలక ప్రయాసల ను గురించిన ఒక ఆసక్తిదాయకమైన సమర్పణ ను అందించారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ దార్శనికత లో ఆరోగ్య రంగానికి పెద్దపీట వేయవలసిన అవసరం ఎంతైనా ఉందని వారు స్పష్టం చేశారు.
నైట్రోజన్ జనరేటర్ ను ఆక్సీజన్ జనరేటర్ గా మార్చడం లో, కేన్సర్ చికిత్స కోసం ఉద్దేశించిన సెల్ థెరపీ పరంగా @iitbombay సాంకేతిక విజ్ఞాన రంగం లో సలిపిన విస్తృత కృషి తాలూకు వివరాల తో పాటు ఎల్ఎఎస్ఇ ప్రోగ్రాము ను, ఇంకా- డిజిటల్ హెల్థ్, ఎఐ, డేటా సైన్స్- లలో మాస్టర్స్ కోర్సు లను మొదలుపెట్టడం వంటి విద్యా రంగ సంబంధి నూతన ఆవిష్కరణల ను గురించి కూడా తెలుసుకొని నేను సంతోషించాను.
కోవిడ్ ప్రభావాన్ని తగ్గించే దిశ లో ఒక మాడ్యులర్ హాస్పిటల్ ను ఏర్పాటు చేసినట్లు, వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల ను ముందస్తు గా అంచనా వేయడం, అనేక విభాగాల లో వారు చేపట్టిన పరిశోధన లు, ప్రోగ్రామింగ్ లోను, డేటా సైన్స్ లోను ఆన్ లైన్ మాధ్యమం ద్వారా బిఎస్‌సి ని ప్రవేశ పెట్టినట్లు @iitmadras కు చెందిన దళమొకటి తెలియ జేశారు. భారతదేశం అంతటా డిజిటల్ కవరేజీ ని పెంచే విషయం పైన సైతం వారు శ్రమిస్తున్నారు.
బ్లాక్ చైన్ టెక్నాలజీస్, గాలి నాణ్యత పర్యవేక్షించడం, ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇన్‌జెక్శన్స్ తో పాటు మరిన్ని విషయాల లో వినూత్న పరిశోధన కు, నూతన ఆవిష్కరణ లకు ఒక కేంద్రం గా @IITKanpur తయారవుతూ ఉండటాన్ని చూసి గర్వపడ్డాను. స్టార్ట్-అప్స్ కు అందిస్తున్న సమర్థన ను, వృత్తి నిపుణుల లో నైపుణ్యాల మెరుగుదలకు పూనుకోవడం అనేవి భారతదేశం లో యువ శక్తి కి ఎంతో మేలు చేయగలవు.
సమావేశం తాలూకు మరిన్ని వివరాల కోసం
https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1733638
అనే లింకు ను సందర్శించగలరు.
**
(Release ID: 1734111)
Visitor Counter : 178
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam