ప్రధాన మంత్రి కార్యాలయం

ఒలింపిక్ క్రీడల లో పాల్గొన్న భార‌తీయ ఆటగాళ్ల ను ఒలింపిక్ క్రీడల దినం నాడు  ప్ర‌శంసించిన ప్ర‌ధాన మంత్రి


టోక్యో ఒలింపిక్ క్రీడల లో పాలుపంచుకొనే భార‌తీయ క్రీడాకారుల కు శుభాకాంక్ష‌లుతెలిపారు

మైగవ్ ఒలింపిక్ క్విజ్ లో పాల్గొన‌వ‌ల‌సిందంటూ యువ‌జ‌నుల కు ఆహ్వానం ప‌లికారు

Posted On: 23 JUN 2021 8:45AM by PIB Hyderabad

గ‌త కొన్ని సంవత్సరాలుగా జ‌రిగిన వివిధ ఒలింపిక్ క్రీడోత్సవాల లో భార‌త‌దేశాని కి ప్రాతినిధ్యం వ‌హించిన వారంద‌రిని చూసుకొని దేశ ప్ర‌జ‌లు గ‌ర్వప‌డుతున్నారు అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న ఒలింపిక్ క్రీడల దినం సంద‌ర్భం లో పేర్కొన్నారు. టోక్యో ఒలింపిక్ క్రీడల లో పాలుపంచుకోనున్న భార‌తీయ క్రీడాకారుల కు, భారతీయ క్రీడాకారిణుల కు అంతా మంచే జ‌ర‌గాలి అని ఆయ‌న అభిల‌షించారు.

ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో :

 

‘‘ఈ రోజు న ఒలింపిక్ క్రీడల దినం. గ‌త కొన్నేళ్ళు గా జ‌రిగిన వేరు వేరు ఒలింపిక్ క్రీడల లో భార‌త‌దేశాని కి ప్రాతినిధ్యం వ‌హించిన అంద‌రిని నేను అభినందిస్తున్నాను. క్రీడ‌ల‌ కు వారు అందించిన తోడ్పాటు ను, ఇత‌ర క్రీడాకారుల కు ప్రేర‌ణ ను ఇచ్చే దిశ లో వారు చేసిన కృషి ని చూసుకొని మ‌న దేశ ప్ర‌జ‌లు గ‌ర్వ‌ప‌డుతున్నారు.

 

కొద్ది వారాల లో @Tokyo2020 మొద‌ల‌వ‌నుంది. మ‌న దేశాని కి చెందిన స‌ర్వోత్త‌మ క్రీడాకారుల‌ తో కూడిన‌ ద‌ళం ఆ క్రీడోత్సవాల లో అత్యుత్త‌మ ఫ‌లితాల‌ ను సాధించాల‌ని ఆకాంక్షిస్తున్నాను. ఆ క్రీడలు ఆరంభం కావ‌డానికి ముందుగా మైగవ్ లో ఒక ఆస‌క్తిదాయ‌క‌మైన‌టువంటి క్విజ్ ను నిర్వహించడం జరుగుతుంది. ఆ క్విజ్ పాల్గొన‌వ‌ల‌సిందంటూ మీ అంద‌రికి, ప్ర‌త్యేకించి నా యువ మిత్రుల‌ కు, నేను విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

 

https://quiz.mygov.in/quiz/road-to-tokyo-2020/

 

********

DS/SH



(Release ID: 1729635) Visitor Counter : 146