ఆయుష్

7వ అంతర్జాతీయ యోగా-2021 రోజున "ఎం-యోగా" యాప్‌ ను ప్రారంభించిన - ప్రధానమంత్రి


డబ్ల్యూ.హెచ్‌.ఓ. సహకారంతో "ఎం-యోగా" మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసిన - భారత ప్రభుత్వం

Posted On: 21 JUN 2021 4:46PM by PIB Hyderabad

7 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, "డబ్ల్యూ.హెచ్‌.ఓ. ఎం-యోగా" యాప్‌ ను ప్రారంభించారు.  "ఎం-యోగా" యాప్ అనేక భాషలలో సాధారణ యోగా నియమాల ఆధారంగా యోగా శిక్షణ, అభ్యాసానికి చెందిన అనేక వీడియోలను అందిస్తుంది.  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు ప్రాచీన శాస్త్రాల కలయికకు ఇది ఒక గొప్ప ఉదాహరణగా ప్రధానమంత్రి అభివర్ణిస్తూ,  యోగా ప్రపంచాన్ని వ్యాప్తి చేయడంలో, "ఎం-యోగా" యాప్ సహాయపడుతుందనీ, "ఒక ప్రపంచం, ఒక ఆరోగ్యం" ప్రయత్నాలకు, ఇది దోహదపడుతుందనీ, ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా, ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఇలా అన్నారు: 

"ఐక్యరాజ్యసమితి లో భారతదేశం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించినప్పుడు,  ఈ యోగా విజ్ఞానాన్ని ప్రపంచం మొత్తానికి అందుబాటులోకి తీసుకు రావాలన్నదే దీని వెనుక ఉన్న స్ఫూర్తి. అయితే, ఈ రోజు, ఐక్యరాజ్యసమితి మరియు డబ్ల్యూ.హెచ్‌.ఓ. తో కలిసి భారతదేశం ఈ దిశగా  మరో ముందడుగు వేసింది. 

ఇప్పుడు ప్రపంచం "ఎం-యోగా" యాప్ శక్తిని పొందబోతోంది.  ఈ యాప్ లో, సాధారణ యోగా నియమ, నిబంధనల ఆధారంగా యోగా శిక్షణ కు సంబంధించి అనేక వీడియోలు ప్రపంచంలోని వివిధ భాషల్లో అందుబాటులో ఉంటాయి.  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు ప్రాచీన శాస్త్రాల కలయికకు ఇది ఒక గొప్ప ఉదాహరణ. ప్రపంచవ్యాప్తంగా యోగాను విస్తరించడంలోనూ, "ఒక ప్రపంచం, ఒకటే ఆరోగ్యం" కోసం చేసే ప్రయత్నాలను విజయవంతం చేయడంలోనూ, "ఎం-యోగా" యాప్ పెద్ద పాత్ర పోషిస్తుందని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను.”

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో యోగా మరియు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో, ముఖ్యంగా, ప్రస్తుతం కొనసాగుతున్న మహమ్మారి సమయంలో, ఈ మొబైల్-యాప్, ఎంతగానో సహాయపడుతుందని, ప్రధానమంత్రి పేర్కొన్నారు.  కోవిడ్-19 నుండి కోలుకున్న కోవిడ్ రోగుల ఆరోగ్యాన్ని పునరుద్ధరించడంలో కూడా, ఇది కీలక పాత్ర పోషిస్తుందని, ఆయన తెలియజేశారు. 

నేపధ్యం :

మొబైల్-యోగాపై దృష్టి సారిస్తూ, ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్‌.ఓ) సంయుక్తంగా 2019 మధ్యలో ఒక ప్రాజెక్టును చేపట్టాయి.  2030 నాటికి సార్వత్రిక ఆరోగ్యాన్ని సాధించడానికి ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల క్రింద ‘ఆరోగ్యంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి’ (బి.హెచ్‌.బి.ఎం) అనే భావనతో, ఇది ప్రారంభమైంది.  "ఆరోగ్యగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి" (బి.హెచ్‌.బి.ఎం) అనేది, డబ్ల్యూ.హెచ్‌.ఓ. నేతృత్వంలో ప్రపంచ దేశాల భాగస్వామ్య కార్యక్రమం. ఇది సంక్రమణ-కాని వ్యాధులను (ఎన్‌.సి.డి) అరికట్టడానికి జాతీయ ఆరోగ్య వ్యవస్థ పరిధిలో "సంచార ఆరోగ్యం" (ఎం-హెల్త్) సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి మద్దతు సహాయ పడుతుంది. 

పై లక్ష్యాలను సాధించడానికి, డబ్ల్యూ.హెచ్.ఓ. మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖల మధ్య 2019 జూలై నెలలో ఒక అవగాహన ఒప్పందం కుదిరింది.  "ఎం-యోగా" ప్రాజెక్ట్ నాలుగు రంగాలపై దృష్టి పెట్టింది:

(1)  అందరి క్షేమం కోసం సాధారణ యోగా నియమ, నిబంధనలు; 

(2) మానసిక ఆరోగ్యం మరియు స్థితిస్థాపకత కోసం యోగా;

(3) కౌమారదశ లోని వారి కోసం యోగా; మరియు

(4)  మధుమేహ వ్యాధి వచ్చే అవకాశమున్న వారి కోసం. 

దీని ఆధారంగా, డబ్ల్యూ.హెచ్.ఓ. సాంకేతిక భాగస్వాములతో సంప్రదించి, అవసరమైన చిన్న పుస్తకాలు, మొబైల్-యాప్ లను,  మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ (ఎం.డి.ఎన్.ఐ.వై), అభివృద్ధి చేయాల్సి ఉంది.  చిన్న పుస్తకాన్ని రూపొందించే పనులు చివరి దశలో ఉన్నాయి. ప్రస్తుతం ప్రారంభించిన యాప్ ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఆరు అధికారిక భాషల్లోని రెండింటిలో అంటే ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో  అందుబాటులో ఉంది.  సాధారణ ఆరోగ్యం కోసం, వివిధ వ్యవధితో (45 నిమిషాలు, 20 నిమిషాలు మరియు 10 నిమిషాల నిడివితో) ఉమ్మడి యోగా నియమ నిబంధనల తయారీకి, అదేవిధంగా,  సాధారణ యోగా నియమ,నిబంధనలతో చిన్న పుస్తకాల తయారీకి,  వీడియోలు, 6 ప్రధాన యు.ఎన్. భాషల్లో వాటి అనువాదాలు, భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు చిన్న పుస్తకాల నమూనాల తయారీ లో, మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ (ఎం.డి.ఎన్.ఐ.వై), కీలక పాత్ర పోషించింది. 

*****



(Release ID: 1729190) Visitor Counter : 234