మంత్రిమండలి

డీపీఐఐటీ కార్యదర్శి డా.గురుప్రసాద్ మొహాపాత్ర మరణం పట్ల కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి సంతాపం

प्रविष्टि तिथि: 19 JUN 2021 11:07AM by PIB Hyderabad

డీపీఐఐటీ కార్యదర్శి డా.గురుప్రసాద్ మొహాపాత్ర ఆకస్మిక మరణం పట్ల కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి శ్రీ రాజీవ్‌ గౌబా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన సంతాపాన్ని ట్వీట్‌ ద్వారా తెలియజేశారు.

    “డా.మొహాపాత్ర నా ప్రియ సహోద్యోగి. వ్యూహాత్మక ఆలోచనలు, నాయకత్వ లక్షణాలు నిండిన ఉత్తమ ప్రజా సేవకుడు.

    ఒక సాధికారిత బృందానికి అధిపతిగా కొవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో అంకితభావంతో పనిచేశారు.

    కరోనా సోకి ఆరోగ్యం బాగా లేనప్పటికీ, గంటల తరబడి పని చేస్తూనే ఉండేవారు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కోసం తీవ్రమైన డిమాండ్‌ ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఆక్సిజన్‌ సరఫరాను పర్యవేక్షించారు.

    చురుకైన విధానాలు, ప్రజాసేవ పట్ల నిబద్ధతతో డా.మొహాపాత్ర చిరస్మరణీయులు. ఆయన ఆకస్మిక మరణం మనందరికీ తీరని నష్టం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను” అని తన ట్వీట్‌లో శ్రీ రాజీవ్‌ గౌబా పేర్కొన్నారు.
 

***


(रिलीज़ आईडी: 1728741) आगंतुक पटल : 229
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam