ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ అథ్లెట్ శ్రీ మిల్కాసింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
19 JUN 2021 8:16AM by PIB Hyderabad
ప్రముఖ అథ్లెట్ శ్రీ మిల్కాసింగ్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శ్రీ మిల్కాసింగ్ ను గొప్ప క్రీడాకారుడిగా అభివర్ణించిన ప్రధానమంత్రి దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేసి భారత ప్రజల హృదయాలలో ఆయన సుస్థిర స్థానం సంపాదించారని అన్నారు.
మిల్కా సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ శ్రీ నరేంద్రమోడీ ట్వీట్ చేశారు. ' శ్రీ మిల్కాసింగ్ మృతితో భారతదేశం ఒక గొప్ప క్రీడాకారుడుని కోల్పోయింది. ఆయన భారతదేశానికి క్రీడారంగంలో ఎనలేని సేవలను అందించి దేశ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. తన వ్యక్తిత్వంతో ఆయన లక్షలాది మంది భారతీయులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన మృతి నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
కొన్ని రోజుల ముందే నేను శ్రీ మిల్కా సింగ్ తో మాట్లాడాను. ఆయనతో ఇది నా చివరి సంభాషణ అవుతుందని అనుకోలేదు. అనేకమంది ఔత్సాహిక అథ్లెట్లు ఆయన నుంచి స్ఫూర్తి పొందుతారు. ఆయన కుటుంబ సభ్యులు, ప్రపంచవ్యాపితంగా ఉన్న ఆయన అభిమానులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను.' అని శ్రీ నరేంద్ర మోడీ తన ట్వీట్లలో పేర్కొన్నారు.
*****
(रिलीज़ आईडी: 1728449)
आगंतुक पटल : 243
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam