రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
మ్యుకోర్‌మైకోసిస్ చికిత్సలో ఉపయోగించే లిపోసోమల్ యాంఫోటెరిసిన్-బి ఔషధ నిల్వలు భారత్‌లో అవసరం కంటే ఎక్కువే ఉన్నాయి: శ్రీ మన్‌సుఖ్ మాండవీయ
ఈ నెల 17 వరకు అన్ని రాష్ట్రాలు, యూటీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 7,28,045 వయల్స్ కేటాయింపు
Posted On:
18 JUN 2021 2:16PM by PIB Hyderabad
"ఈ నెల 16న, మ్యుకోర్‌మైకోసిస్ యాక్టివ్ కేసుల సంఖ్య 27,142. భవిష్యత్తులో బ్లాక్‌ఫంగస్ కేసులు పెరిగినా, రోగులకు చికిత్సలో ఉపయోగించే యాంఫోటెరిసిన్-బి, ఇతర ఔషధ నిల్వలు భారత్‌లో అవసరానికి మించి ఉన్నాయి. ఈ ఔషధం దేశీయ ఉత్పత్తిని ఐదు రెట్లకు మించి భారత్ పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేవలం 62 వేల వయల్స్‌గా ఉన్న ఉత్పత్తి, ఈ నెలలో 3.75 లక్షలు దాటుతుందని అంచనా. దేశీయంగా ఉత్పత్తిని పెంచడంతోపాటు, విదేశాల నుంచి 9.05 లక్షల వయల్స్‌ను మైలాన్ సంస్థ ద్వారా తెప్పిస్తోంది. దేశంలో యాంఫోటెరిసిన్-బి అందుబాటును పెంచే ఏ ఒక్క అవకాశాన్ని భారత్ వదలడం లేదు" అని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.
కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ ఆధ్వర్యంలోని ఔషధ విభాగం, ఈ నెల 17వ తేదీ వరకు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మొత్తం 7,28,045 వయళ్ల లిపోసోమల్ యాంఫోటెరిసిన్-బి ఔషధాన్ని కేటాయించింది. బ్లాక్ ఫంగస్‌గా పిలిచే మ్యుకోర్‌మైకోసిస్ చికిత్స కోసం యాంఫోటెరిసిన్-బి ఔషధాన్ని ఉపయోగిస్తారు.
క్ర.సం.
|
రాష్ట్రం/యూటీ
|
మొత్తం వయల్స్
|
1
|
అండమాన్&నికోబార్ దీవులు
|
0
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
47510
|
3
|
అరుణాచల్‌ప్రదేశ్
|
0
|
4
|
అసోం
|
200
|
5
|
బిహార్
|
8540
|
6
|
చండీఘర్
|
2800
|
7
|
చత్తీస్‌ఘడ్
|
4720
|
8
|
డామన్&డయ్యు, దాద్ర&నగర్ హవేలీ
|
500
|
9
|
దిల్లీ
|
21610
|
10
|
గోవా
|
740
|
11
|
గుజరాత్
|
148410
|
12
|
హరియాణా
|
25560
|
13
|
హిమాచల్ ప్రదేశ్
|
470
|
14
|
ఉత్తరాఖండ్
|
600
|
15
|
ఝార్ఖండ్
|
2030
|
16
|
కర్ణాటక
|
52620
|
17
|
కేరళ
|
2030
|
18
|
లద్దాఖ్
|
0
|
19
|
లక్షద్వీప్
|
0
|
20
|
మధ్యప్రదేశ్
|
49770
|
21
|
మహారాష్ట్ర
|
150265
|
22
|
మణిపూర్
|
150
|
23
|
మేఘాలయ
|
0
|
24
|
మిజోరం
|
0
|
25
|
నాగాలాండ్
|
100
|
26
|
ఒడిశా
|
1260
|
27
|
పుదుచ్చేరి
|
460
|
28
|
పంజాబ్
|
8280
|
29
|
రాజస్థాన్
|
63070
|
30
|
సిక్కిం
|
0
|
31
|
తమిళనాడు
|
25260
|
32
|
తెలంగాణ
|
34350
|
33
|
త్రిపుర
|
150
|
34
|
ఉత్తరప్రదేశ్
|
39290
|
35
|
ఉత్తరాఖండ్
|
3380
|
36
|
పశ్చిమబంగాల్
|
2640
|
37
|
కేంద్ర ప్రభుత్వ సంస్థలు
|
31280
|
|
మొత్తం
|
728045
|
****
(Release ID: 1728225)
Visitor Counter : 272
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam