ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

70 రోజుల తరువాత చికిత్సలో ఉన్న కేసులు 9 లక్షల లోపుకు గత 24 గంటలలో 62,224 కొత్త కరోనా కేసులు


నెలకు పైగా కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువమంది
కోలుకున్నవారి శాతం 95.80%కు పెరుగుదల

రోజువారీ పాజిటివిటీ 3.22%, 9 రోజులుగా 5% లోపే

Posted On: 16 JUN 2021 10:52AM by PIB Hyderabad

దేశంలో రోజువారీ కొత్త కరోనా కేసులు తగ్గుదల బాటలో సాగుతున్నాయి. గత 24 గంటలలో  62,224 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 9 రోజులుగా లక్షలోపే కేసులు వస్తున్నాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001F4JM.jpg

చికిత్సలో ఉన్న కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారు  8,65,432 కాగా 70 రోజులతరువాత ఈ సంఖ్య 9 లక్షలదిగువకు పడిపోయింది. గత 24 గంటలలో నికరంగా  47,946 కేసులు తగ్గాయి. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారు మొత్తం పాజిటివ్ కేసులలో 2.92% మాత్రమే.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002WXRW.jpg

కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతూ ఉండటంతో 34 రోజులుగా  కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. గత 24 గంటలలో 1,07,628 మంది కోలుకున్నారు.  అంతకుముందు రోజుకంటే 45,404 మంది అధికంగా కోలుకున్నారు. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00339EW.jpg

 

ఇప్పటివరకు కోవిడ్ బారిన పడినవారిలో  2,83,88,100 మంది కోలుకున్నారుఇ. గత 24 గంటలలో 1,07,628 కోలుకున్నారు. ఇది మొత్తం కోలుకున్నవారి వాటాను   95.80% కు చేర్చింది. 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0040MNI.jpg

పరీక్షల సామర్థ్యం పెంచటంతో గత 24 గంటలలో  19,30,987 కోవిడ్ పరీక్షలు జరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 38,33,06,971 కి చేరాయి. పరీక్షలు పెంచేకొద్దీ పాజిటివిటీ తగ్గుతోంది. ప్రస్తుతం వారపు పాజిటివిటీ  4.17% కు తగ్గగా నేడు రోజువారీ పాజిటివిటీ 3.22% నమోదైంది. ఇది వరుసగా 9వ రోజుకూడా 5% లోపే ఉంది.   

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00564WJ.jpg

కోవిడ్ టీకా డోసుల పంపిణీలో భారత దేశం నిన్న 26 కోట్ల మైలురాయి దాటిందీ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 36,17,099 శిబిరాల ద్వారా 26,19,72,014 టీకా డోసుల పంపిణీ జరిగింది. గత 24 గంటలలో  28,00,458 టీకా డోసులిచ్చారు. వాటి వివరాలు:

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,00,79,330

రెండో డోస్

70,00,612

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,69,10,170

2nd Dose

89,10,305

18-44 వయోవర్గం

మొదటి డోస్

4,51,03,965

రెండో డోస్

9,00,035

45-60 వయోవర్గం

మొదటి డోస్

7,72,98,842

రెండో డోస్

1,22,00,449

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

6,32,89,614

రెండో డోస్

2,02,78,692

మొత్తం

26,19,72,014

 

****


(Release ID: 1727703) Visitor Counter : 206