ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
గత 24 గంటల్లో 80,834 కొత్త కేసులు; 71 రోజుల్లో అత్యల్పం
చికిత్సలో ఉన్న కేసులు 10,26,159కు తగ్గుదల
రోజువారీ కోలుకున్న కేసులు 31రోజులుగా తగ్గుదల బాటలో
కోలుకున్నవారి శాతం 95.26% కు పెరుగుదల
రోజువారీ పాజిటివిటీ 4.25%, 20 రోజులుగా 10% లోపే
Posted On:
13 JUN 2021 11:28AM by PIB Hyderabad
దేశంలో గత 24 గంటలలో 80,834 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా లక్షలోపు కేసులు నమోదు కావటం ఇది వరుసగా ఆరోరోజు. కేంద్రంతో రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు సమన్వయంతో చేసిన కృషి పలితం ఇది.

చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారు 10,26,159 మంది. ఇలా 13 రోజులుగా 20 లక్షలలోపే నమోదవుతూ వస్తోంది. గత 24 గంటలలో నికరంగా తగ్గిన బాధితులు 54,531 మంది కాగా ఇప్పుడు చికిత్సలో ఉన్నవారు మొత్తం పాజిటివ్ కేసులలో 3.49% మాత్రమే.

కోవిడ్ నుంచి మరింత మంది కోలుకుంటూ ఉండటంతో వరుసగా 31 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉన్నారు. గత 24 గంటలలో 1,32,062మంది కోలుకున్నారు. అంతకుముందు రోజుకంటే కొత్త కేసులకూ, కోలుకున్నవారికీ మధ్య అంతరం 51,228 మంది ఎక్కువగా ఉంది.

కరోనా మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు 2,80,43,446 మంది కోలుకోగా గత 24 గంటలలో 1,32,062 మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా కోలుకున్నవారి శాతం స్థిరంగా పెరుగుతూ 95.26% కు చేరింది.

కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం పెరగటంతో గత 24 గంటలలో 19,00,312 పరీక్షలు జరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా జరిపిన పరీక్షల సంఖ్య 38.81 కోట్లు దాటి 37,81,32,474 కు చేరింది.
ఒకవైపు దేశమంతటా పరీక్షలు పెంచగా మరోవైపు వారం వారం పాజిటివిటీ తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం వారపు పాజిటివిటీ 4.74% ఉండగా రోజువారీ పాజిటివిటీ ఈరోజు 4.25% కు చేరింది. గత 20 రోజులుగా ఇది 10% లోపే ఉంటోంది.

దేశవ్యాప్త టీకాల కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 35,05,535 శిబిరాల ద్వారా 25 కోట్ల డోసులకు పైగా (25,31,95,048) పంపిణీ జరిగినట్టు ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం తెలియజేస్తోంది. ఇవీ వివరాలు:
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
1,00,48,183
|
రెండో డోస్
|
69,63,347
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
1,67,28,272
|
రెండో డోస్
|
88,42,292
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
4,02,15,561
|
రెండో డోస్
|
6,77,853
|
45 -60 వయోవర్గం
|
మొదటి డోస్
|
7,54,28,713
|
రెండో డోస్
|
1,19,42,926
|
60 పైబడ్డవారు
|
మొదటి డోస్
|
6,24,72,732
|
రెండో డోస్
|
1,98,75,169
|
మొత్తం
|
25,31,95,048
|
***
(Release ID: 1726811)
Visitor Counter : 265
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam