ప్రధాన మంత్రి కార్యాలయం

యువజనుల ను వారి రచనా నైపుణ్యాల ను ఉపయోగించుకోవలసింది గాను, భారతదేశ బౌద్ధిక సంపద కు వారి వంతు తోడ్పాటు ను అందించవలసింది గాను ఆహ్వానించిన ప్రధాన మంత్రి

Posted On: 08 JUN 2021 8:30PM by PIB Hyderabad

భవిష్యత్తు కాలం లో నాయకత్వ పాత్రల ను పోషించడం కోసం యువ జ్ఞ‌ానార్థుల ను సన్నద్ధులను చేయడానికి ఉద్దేశించినటువంటి ‘యువ: ప్రైమ్ మినిస్టర్స్ స్కీమ్ ఫార్ మెంటారింగ్ యంగ్ ఆథర్స్’ ను గురించి తెలుసుకోవలసిందని యువజనుల ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆహ్వానించారు.  

‘‘యువత వారి రచనా ప్రావీణ్యాలను ఉపయోగించుకోవడం కోసం, అలాగే భారతదేశ బౌద్ధిక సంపద కు వారి వంతు తోడ్పాటు ను అందించడం కోసం కూడాను ఒక ఆసక్తిదాయకమైనటువంటి అవకాశం ఇక్కడ లభిస్తోంది. https://innovateindia.mygov.in/yuva/ గురించి మరింత అధిక సమాచారాన్ని పొందండి’’ అని శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో సూచించారు.

 

 


యువ మేధస్సుల ను శక్తిమంతంగా మార్చడం పట్ల, భావి నాయకత్వ భూమిక ల కోసం యువ జ్ఞానార్థుల ను తయారు చేయగల ఒక బోధన వ్యవస్థ ను నిర్మించడం పట్ల జాతీయ విద్య విధానం 2020 నొక్కిచెప్తోంది.
 
ఈ  లక్ష్యాన్ని ప్రోత్సహించడం తో పాటు, భారతదేశ స్వాతంత్ర్య 75 సంవత్సరాల ఘటన ను స్మరించుకోవడానికి ‘యువ: ప్రైమ్ మినిస్టర్స్ స్కీమ్ ఫార్ మెంటారింగ్ యంగ్ ఆథర్స్’ పేరు తో తీసుకు వచ్చిన ఒక జాతీయ పథకం ఈ విధమైన రేపటి తరం నాయకుల కు ఒక పునాది ని నిర్మించడం లో ఎంతగానో తోడ్పడనుంది.
 
ప్రధానం గా, ఈ పథకం భారతదేశం స్వాతంత్ర్యం సాధించుకొన్న అనంతరం 75 సంవత్సరాల కేసి పయనిస్తున్న సమయం లో భారతీయ సాహిత్యం తాలూకు ఆధునిక రాయబారుల ను సన్నద్ధులను చేయడానికి ఉద్దేశించినటువంటిది.  పుస్తకాల ప్రచురణ లో భారతదేశం మూడో స్థానం లో ఉంది, స్వదేశీ సాహిత్యం తాలూకు ఈ భాండాన్ని మరింత గా అభివృద్ధి పరచాలి అంటే దీనిని ప్రపంచ రంగస్థలం పైన ఆవిష్కరించడమనేది తప్పనిసరి.  



 

***



(Release ID: 1725534) Visitor Counter : 113